Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16-12-2020 బుధవారం దినఫలాలు - సత్యదేవుడుని పూజిస్తే...

Advertiesment
16-12-2020 బుధవారం దినఫలాలు - సత్యదేవుడుని పూజిస్తే...
, బుధవారం, 16 డిశెంబరు 2020 (05:00 IST)
మేషం : వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
వృషభం : రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. మీ కుటుంబీకులతో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధిని సాధిస్తారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మిథునం : నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం పొందుతారు. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. 
 
కర్కాటకం : స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. కార్యసాధనలో జయం, మానసిక ప్రశాంతత పొందుతారు. ప్రతి విషయానికి ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే నమ్ముకోవడం ఉత్తమం. మత్స్యు, కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. 
 
సింహం : గృహోపకరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. మీ శ్రీమతితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు సానుకూలంగా ముగుస్తాయి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. 
 
కన్య : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపారాల అభివృద్ధికి షాపుల, అలంకరణ, కొత్త స్కీములు అమలు చేస్తారు. స్త్రీలకు శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులకు అధిక శ్రమ వల్ల ఆరోగ్యంలో చికాకులను ఎదుర్కొంటారు. సన్నిహితుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
తుల : ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలు, దూర ప్రయాణాల్లో మెళకువ వహించండి. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఒకనాటి మీ కష్టానికి నేడు ప్రతిఫలం లభిస్తుంది. 
 
వృశ్చికం : నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం పొందుతారు. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఖర్చులు, రాబడి విషయాలలో మెళకువ వహించండి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి సలహా ప్రకారమే నడుచుకుంటారు. 
 
ధనస్సు : ప్రింటింగ్ స్టేషనరీ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులు వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. సోదరీ, సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త అవసరం. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. 
 
మకరం : మీ బలహీనతను ఆసరా చేసుకుని కొంతమంది తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఖర్చులు మీ అంచనాలను మించడంతో రుణాలు, చేబదుళ్లు తప్పవు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
కుంభం : ప్రముఖులు, ఆత్మీయులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ చాలా అవసరం. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ శ్రీమతితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. 
 
మీనం : వేడుకలు, దైవకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. స్థిరచరాస్తుల విక్రయం జరుపుతారు. తక్కువ రాబడితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చల్లో ఏకాగ్రత వహిస్తారు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివలింగాన్ని ఇంట్లో వుంచుకోవచ్చా?