Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-12-2020 సోమవారం దినఫలాలు - మల్లిఖార్జున స్వామిని ఆరాధిస్తే..

Advertiesment
14-12-2020 సోమవారం దినఫలాలు - మల్లిఖార్జున స్వామిని ఆరాధిస్తే..
, సోమవారం, 14 డిశెంబరు 2020 (04:00 IST)
మేషం : వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సోదరీ, సోదరుల మధ్య సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమించి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఎవరినీ సంప్రదించకుండా సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. 
 
వృషభం : వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. ఆలయాలను సందర్శిస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. 
 
మిథునం : ఉద్యోగస్తులు కొత్తగా వచ్చిన అధికారులను ఆకట్టుకుంటారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ప్రైవేటు సంస్థలలోని వారు ఎంత శ్రమించినా యాజమాన్యం గుర్తింపు ఉండదు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. 
 
కర్కాటకం : రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. రవాణా, ఎక్స్‌పోర్టు రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు. ఎప్పటి సమస్యలు అపుడే పరిష్కరించుకోవడం ఉత్తమం. ఆత్మీయుల ఆకస్మిక రాక సంతోషం కలిగిస్తుంది. విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. 
 
సింహం : కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారుకు సంతృప్తి, పురోభివృద్ధి. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి. 
 
కన్య : ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. ఉద్యోగస్తులకు హోదా పెరగడంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. 
 
తుల : బంధు మిత్రుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. దైవ, సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. స్త్రీలకు కళా రంగాల పట్ల, వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. మీ వాగ్ధాటి, చాకచక్యంతో ఎదుటివారిని మెప్పిస్తారు. 
 
వృశ్చికం : స్త్రీలకు కళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులు తప్పవు. ప్రింటింగ్ రంగాల్లో వారికి పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. దైవ, సమాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధన సహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. 
 
ధనస్సు : పూర్వపు పరిచయ వ్యక్తుల కలయిక మీకెంతో ఉపకరిస్తుంది. చేపట్టిన పనులు బంధువుల కారణంగా అర్థాంతరంగా ముగించాల్సివుంటుంది. ఇంటా, బయటా మీ మాటకు ఆదరణ లభిస్తుంది. గత విషయాల గురించి ఆలోచిస్తూ కాలం వ్యర్థం చేయకండి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. 
 
మకరం : ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. బంధు మిత్రులతో వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. హోటల్, బేకరీ, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. మీ జీవిత భాగస్వామితో ఉల్లాసంగా గడుపుతారు. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడుట మంచిది. 
 
కుంభం : మహిళా ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. స్థిరచరాస్తుల విషయంలో పునరాలోచన మంచిది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 
 
మీనం : వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యవారాలు ఊపందుకుంటాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు పథకాలు రూపొందిస్తారు. ప్రముఖులతో తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కుటుంబీకులకు, బంధువుల నుంచి వ్యతిరేకతలు ఎదురవుతాయి. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. రుణాల కోసం అన్వేషిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల కొండపై కనిపించని భౌతిక దూరం .. శానిటైజేషన్ అస్సలే లేదు..