Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10-12-2020 గురువారం దినఫలాలు - వినాయకుడిని ఆరాధించినా సంకల్పసిద్ధి

Advertiesment
10-12-2020 గురువారం దినఫలాలు - వినాయకుడిని ఆరాధించినా సంకల్పసిద్ధి
, గురువారం, 10 డిశెంబరు 2020 (05:00 IST)
మేషం : స్టేషనరీ ప్రింటింగ్ రంగాల్లో వారికి సదావకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు. మీ యత్నాలకు సన్నిహితుల నుంచి సహకారం లభిస్తుంది. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్సాంతిని దూరం చేస్తాయి. ప్రయాణాలలో మెళకువ అవసరం. 
 
వృషభం : ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళకువ వహించండి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. రావలసిన ధనం వాయిదాపడటంతో ఒకింత ఆందోళన చెందుతారు. విద్యార్థులకు తోటివారి వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. 
 
మిథునం : కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో మెళకువ వహించండి. నూతన దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి, పట్టుదల అవసరమని గమనించండి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళకువ అవసరం. 
 
కర్కాటకం : ప్రింటింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. హోటల్, క్యాటరింగ్ రంగాలవారికి లాభదాయకం. ప్రైవేటు సంస్థలలోని వారి నిర్లక్ష్యం, మతిమరుపు వల్ల యాజమాన్యం కోపతాపాలకు గురికావాల్సి వస్తుంది. నేడు చేద్దామనుకున్న పనులు రేపటికి వాయిదావేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. 
 
సింహం : ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. రావలసిన ధనం అందడంతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కన్య : ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. విదేశీయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తిచేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
తుల : మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎప్పటి సమస్యలు అపుడే పరిష్కరించడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
వృశ్చికం : గృహానికి కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు. విద్యార్థులు అధిక ఉత్సాహం ప్రదర్శించడం వల్ల సమస్యలకు లోనవుతారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. పరిచయాలేర్పడతాయి. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
ధనస్సు : స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. పాత మిత్రుల నుంచి ఆహ్వానాలు, లేఖలు అందుకుంటారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. అవకాశవాదులు అధికం కావడం వల్ల ఊహించని ఒత్తిడికి లోనవుతారు. బంధువుల మధ్య అపోహలు తొలగిపోయి, ఆప్యాయతలు మరింత బలపడతాయి. 
 
మకరం : వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పత్రికా, ప్రైవేట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఆత్మీయులను విమర్శించుట వల్ల చికాకులను ఎదుర్కొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. సోదరీ, సోదరుల మధ్య సమస్యలు తలెత్తుతాయి. 
 
కుంభం : నమ్మకం పట్టుదలతో యత్నాలు సాధించండి. సత్‌ఫలితాలు పొందుతారు. కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. వచ్చిన సొమ్మును పొదుపు పథకాల వైపు మళ్లించండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. 
 
మీనం : ప్రతి విషయంలో ఆత్మనిగ్రహం అవసరమని గమనించండి. దూర ప్రయాణాల్లో వస్తువులు జారవిడుచుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలు వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2021 మేషరాశి: ఈ ఏడాది అంతా శుభదాయకమే... ఐతే?