Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-12-2020 శనివారం దినఫలాలు - సత్యనారాయణ స్వామిని పూజిస్తే...

Advertiesment
05-12-2020 శనివారం దినఫలాలు - సత్యనారాయణ స్వామిని పూజిస్తే...
, శనివారం, 5 డిశెంబరు 2020 (05:00 IST)
మేషం : వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. బంధువులను కలుసుకుంటారు. స్త్రీల మాటకు ఇంటా బయటా మంచి స్పందన లభిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. 
 
వృషభం : ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేసే విషయంలో తోటివారి సహకారం లభిస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమిస్తారు. ఉమ్మడి కుటుంబ సమస్యలు పరిష్కారదిశగా సాగుతాయి. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. 
 
మిథునం : పత్రికా సిబ్బందికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. గృహమునకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు ఉత్సాహాననిస్తాయి. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. మీ తప్పులను సరిదిద్దుకోవటానికి యత్నించండి. 
 
కర్కాటకం : పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ అధికారుల నుంచి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వడం మంచిదికాదని గ్రహించండి. దుబారా ఖర్చులు అధికం. స్త్రీల శ్రమకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. 
 
సింహం : వస్త్ర, వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మిత్రులు మీ జీవిత భాగస్వామితో కలహాలు తలెత్తుతాయి. ఆత్మీయుల హితవు మీపై బాగా పని చేస్తుంది. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. నేడు చేద్దామనుకునన పనులు రేపటికి వాయిదా వేస్తారు. 
 
కన్య : వ్యాపారాల్లో పోటీని తట్టుకుంటారు. లక్ష్య సాధనకు విద్యార్థులు మరింతగా శ్రమించాలి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. స్త్రీలకు ఏ విషయంలోను మనస్థిమితం ఉండదు. నిరుద్యోగులకు ఆశాజనకమైన సమాచారం అందుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి పనివారలతో చికాకులు తప్పవు. 
 
తుల : ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. భాగస్వామిక వ్యాపారాల్లో మీ ఆధిపత్యానికి భంగం కలుగవచ్చు. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమించి పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. ఎప్పటి సమస్యలు అపుడే పరిష్కరించుకోవడం ఉత్తమం. ఆత్మీయుల ఆకస్మిక రాక సంతోషం కలిగిస్తుంది. 
 
వృశ్చికం : నమ్మకం పట్టుదలతో మీ యత్నాలు సాగించండి. సత్ఫలితాలు లభిస్తాయి. రావలసిన ధనం సకాలంలో అందుటవల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవు. వాణిజ్య ఒప్పందాలు, లీజు, ఏజెన్సీల వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు అందిన ఉద్యోగ సమాచారం కొత్త ఆశలను కలిగిస్తుంది. 
 
ధనస్సు : హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. దంపతుల మధ్య తరచూ కలహాలు, పట్టింపులు చోటుచేసుకుంటాయి. కుటుంబీకులు, సన్నిహితులతో ఉత్సాహం గడుపుతారు. స్త్రీలు విలువైన వస్తువులు, గృహోపకరణాలు అమర్చుకోగలుగుతారు. వైద్యులు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేస్తారు. 
 
మకరం : కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. ఉద్యోగస్తులు కొత్తగా వచ్చిన అధికారులను ఆకట్టుకుంటారు. ప్రయాణాలు వాయిదాపడతాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికంగా ఉన్నారని గమనించండి. విదేశీయాన యత్నాలలో ఆటంకాలు తొలగిపోగలవు. 
 
కుంభం : పత్రికా సిబ్బందికి ఒత్తిడి, పనిభారం అధికం. ప్రైవేటు సంస్థలలోని వారు ఎంత శ్రమించినా యాజమాన్యం గుర్తింపు ఉండదు. చేపట్టిన పనులు సక్రమంగా సాగక విసుగు కలిగిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. రుణాలు, చేబదుళ్లు తప్పకపోవచ్చు. విద్యార్థులకు శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. 
 
మీనం : వృత్తి ఉద్యోగాల్లో తలెత్తిన ఆటంకాలు తొలగిపోగలవు. కళంకారీ, చేనేత, పీచు వ్యాపారస్తులకు చిన్నతరహా పరిశ్రమల్లో వారికి కలిసిరాగలదు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఎవరినీ సంప్రదించకుండా సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. దుబారా ఖర్చులు అధికమవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

04-12-2020 శుక్రవారం దినఫలాలు - కనకదుర్గాదేవిని పూజించడం వల్ల శుభం