Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

01-12-2020 మంగళవారం దినఫలాలు - అష్టలక్ష్మిని పూజించినా..

Advertiesment
Daily Horoscope
, మంగళవారం, 1 డిశెంబరు 2020 (05:00 IST)
మేషం : దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. మీ వావానం ఇతరులకి ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. ఉమ్మడి, సొంత వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమిస్తారు. వేడుకలు, పార్టీల్లో మితంగా వ్యవహరించండి.
 
వృషభం : ఆర్థిక విషయాలలో కొంత పురోగతి సాధిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, నేర్పు చాలా అవసరం. పాత రుణాలు తీరుస్తారు. ఉద్యోగస్తులు, వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. మీ ఆలోచనలు స్థిమితంగా ఉండవు. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు. 
 
మిథునం : వస్త్ర, గృహోపకరణ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. చేపట్టిన పనులు బంధువుల కారణంగా అర్థాంతరంగా ముంగించాల్సి వస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. 
 
కర్కాటకం : కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఉన్నతాధికారులకు తనిఖీలు, పర్యవేక్షణలలో ఏకాగ్రత ముఖ్యం. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులను కలుసుకుంటారు. 
 
సింహం : వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి. రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో మెళకువ అవసరం. స్త్రీలు, దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల వారికి లాభదాయకం. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాథి పథకాల దిశగా సాగుతాయి. 
 
కన్య : మీ శ్రీమితి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలుపెడతారు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం శ్రేయస్కరం కాదు. ఉద్యోగస్తులు విలువైన కానుకలు అందించి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. 
 
తుల : ఆర్థిక ఇబ్బందులు లేకున్నా తెలియని అసంతృప్తి వెన్నాడుతుంది. నిర్మాణాలలో నాణ్యతా లోపం వల్ల కాంట్రాక్టర్లు నష్టపోయే ఆస్కారం ఉంది. ఖర్చులు, చెల్లింపులు అధికంగా ఉంటాయి. స్థిరాస్తులు, వాహనం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి విందులు, వేడుకలలో చురుకుగా పాల్గొంటారు. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులకు ప్రమోషన్, ప్రత్యేక ఇంక్రిమెంట్లు, బోనస్ వంటి శుభపరిణామాలుంటాయి. మీ సంతానంతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటరు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాలలో లౌక్యం అవసరం. కొంతమంది మీ నుంచి ధనం లేక ఇతరాత్రా సహాయం అర్థిస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. 
 
ధనస్సు : వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవవుండదు. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. చిన్నతరహా పరిశ్రమలు, స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. మీ సామర్థ్యానికి ఆశించినంత ప్రతిఫలం లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. 
 
మకరం : స్త్రీలు కుటుంబ పరిస్థితులతో సర్దుకుపోవడం క్షేమదాయకం. చేతి వృత్తుల వారు, నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవడం శ్రేయస్కరం. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు నుంచి విముక్తి లభిస్తుంది. 
 
కుంభం : బంధువుల రాక ఉల్లాసాన్నిస్తుంది. పెద్దలను, గురువులను గౌరవించడం వల్ల మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆత్మీయుల నుంచి బహుమతులు అందుకుంటారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. విద్యార్థుల్లో మందకొడితనం, ఏకాగ్రతా లోపం వంటి చికాకులు చోటుచేసుకుంటాయి. 
 
మీనం : ఇరుగుపొరుగువారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. సొంతంగా వ్యాపారం చేయాలని సంకల్పం బలపడతుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఎంతో కొంత పొదువు చేయాలన్న మీ యత్నం ఫలించదు. మీ కళత్ర మొండివైఖరి, పట్టుదల మిమ్మల్ని ఇరకాటంలో పడేస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురునానక్ జయంతి: ఇతరుల సంపాదనపై ఆధారపడి జీవించకూడదు..