Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26-12-2020- శనివారం మీ రాశి ఫలితాలు- మీ ఇష్టదైవాన్ని ఆరాధించినట్లైతే?

Advertiesment
26-12-2020- శనివారం మీ రాశి ఫలితాలు- మీ ఇష్టదైవాన్ని ఆరాధించినట్లైతే?
, శనివారం, 26 డిశెంబరు 2020 (05:00 IST)
మీ ఇష్టదైవాన్ని ఆరాధించినట్లైతే సర్వదా పురోభివృద్ధి కానవస్తుంది.  
 
మేషం: ప్రత్తి, పొగాకు, నూనె వ్యాపారస్తులకు స్టాకిస్టులకు లాభసాటిగా వుంటుంది. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు అధికం. ప్రైవేట్ సంస్థల్లో వారు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ మనోవాంఛ నెరవేరే సమయం ఆసన్నమైందని గమనించండి. 
 
వృషభం : ఓర్పు, సర్దుబాటు ధోరణితో వ్యవహరించడంతో ఒక సమస్య పరిష్కారం కాగలదు. సైన్స్, గణిత, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానరాగలదు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. నిరుద్యోగులకు అందిన ఉద్యోగ సమాచారం కొత్త ఆశలను కలిగిస్తుంది. 
 
మిథునం: కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల విషయంలో శ్రమాధిక్యత ప్రయాసలు తప్పవు. ఇతరులకు సలహా ఇవ్వడం వల్ల మాటపడవలసివస్తుంది. మిర్చి, నూనె, కంది వ్యాపారస్తులకు స్టాకిస్టులకు ఆశాజనకం. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. దైవ, సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. 
 
కర్కాటకం: ఉపాధ్యాయులకు గుర్తింపు, వైద్య రంగాల్లో వారికి చికాకు తప్పదు. మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఎదుటివారితో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి.
 
సింహం: హోటల్, తినుబండారు, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికం. ఖర్చులు, ధనసహాయానికి సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత వహించండి. ఫైనాన్స్, చిట్స్ ఫండ్, బ్యాంకింగ్ రంగాల్లో వారు ఇబ్బందులకు గురవుతారు. ఆరోగ్య, ఆహార వ్యవహరాల్లో జాగ్రత్తలు అవసరం. 
 
కన్య: ఉద్యోగస్తులకు సహోద్యోగులతో చికాకులు తప్పవు. దైవ, సేవా, పుణ్య కార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదాపడతాయి.
 
తుల: ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. కోర్టు వ్యవహారాల్లో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రముఖుల కలయిక వాయిదా పడుతుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీలకు చురుకుతనం, పనియందు ధ్యాస చాలా అవసరం. విజ్ఞతగా వ్యవహరించి ఒక సమస్యను పరిష్కరిస్తారు.
 
వృశ్చికం: ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరమని గమనించండి. తాకట్టు పెట్టిన వస్తువులను విడిపిస్తారు. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. విద్యార్థులు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. గృహంలో మార్పులు చేర్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. వృత్తుల వారికి కలిసివస్తుంది.
 
ధనస్సు: మీ రాక బంధువులకు ఉత్సాహం కలిగిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు, ఒత్తిడి తప్పవు. 
 
మకరం: ట్రాన్స్‌‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. మీరు తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వస్త్ర వ్యాపారాలు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని వుండటం శ్రేయస్కరం. విందుల్లో పరిమితి పాటించండి. పెద్ద హోదాలో ఉన్నవారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి.
 
కుంభం: విదేశాలు వెళ్ళేందుకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ప్రైవేట్ సంస్థల్లోని వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముక్కోటి ఏకాదశి : భక్తులతో కిటకిటలాడిపోతున్న ఆలయాలు...