Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెతో శృంగారంలో పాల్గొంటానేమోనని నాపై నాకే అనుమానం కలుగుతోంది. ఏం చేయాలి...?

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (18:20 IST)
నాకు 21 ఏళ్లకే పెళ్లి చేశారు మా పేరెంట్స్. ఇప్పుడు నాకు 30 ఏళ్లు. 7 ఏళ్ల కుమార్తె, 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు. నా భార్యతో శృంగారం రొటీన్‌గా అనిపిస్తోంది. ఎలాంటి ఆనందం కలుగడంలేదు. ఈమధ్య మా ఆఫీసులో 25 ఏళ్ల అమ్మాయి చేరింది. ఆమెతో తెలియకుండానే చాలా క్లోజ్ అయిపోయాను. ఓసారి గుబుక్కున ఆమె చేయి తీసుకుని ముద్దు కూడా పెట్టుకున్నాను. ఆమె నవ్వి వెళ్లిపోయింది. ఆమెతో డేటింగ్ చేయాలనిపిస్తోంది. నా భార్యకు అలా ముద్దుపెడితే, నేను ఇష్టపడుతున్న అమ్మాయికి పెట్టినట్లు అనిపించడంలేదు. ఆ అమ్మాయితో మరింత చనువుగా మారిపోయి ఆమెతో శృంగారంలో పాల్గొంటానేమోనని నాపై నాకే అనుమానం కలుగుతోంది. ఏం చేయాలి...?
 
ఇటువంటి ఫీలింగ్స్ చాలా కొద్దిమందిలో కలుగుతుంటాయి. 21 ఏళ్లకే పెళ్లయిపోవడం వల్ల తమ జీవితంలో పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయలేకపోయామని, ప్రేమ అంటూ అమ్మాయితో హ్యాపీగా సినిమాలు, షికార్లు చేయలేకపోయామని అనుకుంటుంటారు. ఇంకా చిన్న వయసులోనే పెళ్లి కావడంతో కుటుంబ భారం కూడా మీద పడటంతో శృంగార జీవితం కాస్త రొటీన్ అనిపిస్తుంది. అలాగని మరో యువతిలో కొత్త సుఖాన్ని వెతుక్కోవడం మంచిది కాదు. 
 
తొలి రోజుల్లో ఏదో తెలియని కొత్త ఆనందం కలిగినట్లనిపించినా ఆ తర్వాత అది మీ కుటుంబంతో పాటు మీరు ఇష్టపడే అమ్మాయికి కూడా తీవ్రమైన దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎన్నో చిక్కులను తెచ్చి పెడుతుంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పండి. మీ పిల్లలను ఇద్దరినీ మీ పేరెంట్స్ వద్ద ఓ 10 రోజులు వదిలి మీ భార్యతో కలిసి హాయిగా విహార యాత్రకు వెళ్లి రండి. కొత్త ఉత్సాహం మళ్లీ తొంగిచూస్తుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments