Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హాస్టల్ బాలికలకు మత్తుమందిచ్చి విటుల వద్దకు...

Advertiesment
హాస్టల్ బాలికలకు మత్తుమందిచ్చి విటుల వద్దకు...
, సోమవారం, 19 నవంబరు 2018 (14:15 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. సంరక్షణా కేంద్రంలో విద్యాభ్యాసం చేసే బాలికలకు మత్తుమందిచ్చి విటుల వద్దకు పంపుతున్న వికృత చర్య ఒకటి వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీ రాష్ట్రంలోని డియోరియో జిల్లాలో బాలికల సంరక్షణ కేంద్రం ఒకటి ఉంది. ఇక్కడ అనేక మంది విద్యార్థినిలు ఉంటూ చదువుకుంటున్నారు. ఈ కేంద్రంలో ఉండే అమ్మాయిలకు మత్తుమందిచ్చి విలాసవంతమైన విటుల దగ్గరకు పంపుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. 
 
ఈ కేంద్రం నుంచి తప్పించుకున్న 11 యేళ్ళ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ, వింధ్యవాసిని మహిళ, బాలిక సంరక్షణ కేంద్రంలో ఈ రాకెట్ జరుగుతున్నట్టు తమ విచారణలో వెల్లడైందని చెప్పారు. దీంతో ఈ కేంద్రం డైరెక్టర్‌ను అరెస్టు చేశామని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దోపిడీకి వెళ్లి.. మహిళపై అత్యాచారం చేశాడు..