Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిత్య పెళ్ళికొడుకుగా పోలీస్ - మూడు పెళ్ళిళ్ళు.. యువతితో సహజీవనం..!

Advertiesment
Affair
, సోమవారం, 19 నవంబరు 2018 (16:35 IST)
రక్షించాల్సిన పోలీసే కామాంధుడిగా మారాడు. నిత్య పెళ్ళికొడుకు అవతారమెత్తాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడమే కాదు నాలుగో పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. నాలుగో పెళ్ళి చేసుకోబోయే యువతితో సహజీవనం చేస్తూ వచ్చాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో సంసారం చేస్తూ వచ్చాడు. అయితే పోలీస్ నిర్వాకం బయటపడింది. 
 
తెలంగాణా రాష్ట్రంలోని నారాయణగూడెంకు చెందిన రాజయ్య హైదరాబాద్ నగరంలోని ఎల్.బి.నగర్‌లో సిఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 1998 సంవత్సరంలో తన మేనత్త కూతురు సైదమ్మను వివాహం చేసుకున్నాడు. ఆమెతో అక్కడే కాపురం పెట్టాడు. కానీ విధుల నిమిత్తం హైదరాబాదుకు వచ్చేవాడు. ఆ తరువాత మెల్లగా కోదాడకు చెందిన శ్రీవాణి అనే మహిళతో పరిచయం పెట్టుకున్నాడు. ఆమెను 2002లో పెళ్ళాడాడు. 
 
ఆ తరువాత తాండూరుకు చెందిన రేణుకను 2009 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నాడు. ఈమెకు ముగ్గురు పిల్లలు. వీరి ముగ్గురితోనూ కాపురం చేసేవాడు రాజయ్య. ఒకరి గురించి మరొకరు తెలియకుండా జాగ్రత్తపడుతూ వచ్చాడు. కొన్నిరోజులకు విషయం మూడవ భార్య రేణుకకు తెలిసింది. విషయాన్ని మొదటి, రెండవ భార్యలకు చెప్పింది. దీంతో వారు రాజయ్యను దూరం పెట్టేశారు. ఆ విషయం కాస్తా రాజయ్యకు తెలిసింది. దీంతో రేణుకను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. 
 
ఆమెను వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగలేదు. మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో రేణుక పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. రేణుక ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. రేణుక పోలీస్టేషన్‌కు వెళ్ళిందన్న విషయం తెలుసుకున్న రాజయ్య ఆమెను ఫోన్లో బెదిరించాడు. నన్ను నువ్వు ఏమీ చేయలేవని, నీపై ఎస్సి, ఎస్టి కేసు పెడతానని బెదిరించాడు. అంతేకాదు వ్యభిచారం కింద కేసులు పెడతానని కూడా హెచ్చరించాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ అభాగ్యురాలు మహిళా సంఘాలను ఆశ్రయించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ అబద్ధాల కోరు.. లాడెన్ జాడ తెలిసి కూడా..?: డొనాల్డ్ ట్రంప్