భార్య గర్భంగా వున్నప్పుడు.. మృతదేహాన్ని మోయడం చేయొచ్చా?

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (17:43 IST)
ఆధునికత ఎంత పెరిగినా కొందరికి ధర్మ సందేహాలు మాత్రం నివృత్తి కావు. అలాంటి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. శనివారం అభ్యంగన స్నానానికి మంచి రోజు అంటారు ఆధ్యాత్మిక పెద్దలు. పురుషులు బుధవారం, శనివారం, మహిళలు మంగళవారం, శుక్రవారం పూట అభ్యంగన స్నానం చేయాలని వారు చెప్తున్నారు. 
 
ఇంకా అభ్యంగనస్నానానికి వేడినీటినే ఉపయోగించాలని వారంటున్నారు. మంగళవారం, శుక్రవారాల్లో గోర్లను కత్తిరించడం చేయకూడదు. మిగిలిన రోజుల్లో గోర్లను కత్తిరించినప్పటికీ.. ఇంట్లో కూర్చుని చేయకూడదు. 
 
ఇంటికి వెలుపల గోళ్లను కత్తిరించి వాటిని దూరంగా పారేయడం చేయాలి. ఇంట్లో మాత్రం గోర్లు పడకుండా చూడాలి. అలాగే తల దువ్వుకునేటప్పుడు ఆ జుట్టును ఎక్కడపడితే అక్కడ వదిలేయడం చేయకూడదు. జుట్టును దువ్వేటప్పుడు రాలే జుట్టును పేపర్లో మడిచి చెత్తకుండీలో పారేయాలి. రాత్రిపూట బట్టలను ఉతకడం, చెట్ల కింద నిద్రించడం చేయకూడదు. 
 
రాత్రి పూట భోజనంలో ఆకుకూరలు, పెరుగును వాడకూడదు. సాయంత్రం పూట దీపం వెలిగించిన తర్వాత తల దువ్వడం చేయకూడదు. కూరగాయలు కత్తిరించడం, చెత్తను తొలగించడం వంటివి చేస్తే.. ఇంట మహాలక్ష్మీదేవి నివాసముండదు. పురుషులు దీపాలను కొండెక్కించడం చేయకూడదు. మహిళలు దిష్టి తీసే గుమ్మడికాయను, కొబ్బరికాయను రోడ్లపై పగులకొట్టడం చేయకూడదు. 
 
భార్య గర్భంతో వున్నప్పుడు గృహప్రవేశం చేయడం, పాత ఇంటిని కూల్చడం వంటివి, మృతదేహాన్ని మోయడం చేయకూడదు. నిమ్మకాయలతో కూడిన దీపాన్ని ఇంట్లో వెలిగించకూడదు. శనీశ్వరుని నువ్వుల దీపాన్ని ఇంట వెలిగించకూడదు. 
 
ఉదయం పూట నిద్రలేచిన వెంటనే దేవాలయం, గోపురాలు, దేవుళ్ల పటాలు, సముద్రపు ఫోటోలు, సూర్యుడు, దీపం, బంగారం, కుడిచేతిని చూడటం మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ గాడిద, గేదె, చీపురును చూడకపోవడం మంచిదని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

తర్వాతి కథనం
Show comments