గర్భిణీ మహిళ... ప్రసవానికి ముందు 380 వంటకాలు చేసి రికార్డ్(Video)

శనివారం, 23 మార్చి 2019 (14:17 IST)
బిడ్డను ప్రసవించాక ప్రతి మహిళ తన పని తను చేసుకునే స్థితి వుండదు. పైగా ఇక వంటపని అంటే కుదిరే పనేనా? అందుకే... ఓ గర్భిణీ ముందస్తు ప్లాన్ సిద్దం చేసుకుంది. అదేంటయా అంటే... ప్రసవానికి ముందే తనతో పాటు తన కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని వంటలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆమె నిర్విరామంగా నెలలు నిండి బిడ్డ పుట్టే సమయానికి సుమారు 380 రకాల వంటకాలను తయారుచేసింది. ఈ వంటకాల్లో 152 రకాల మీల్స్ మరియు 228 రకాల స్నాక్స్ వున్నాయి. 
 
ఆమె పేరు జెస్సికా మే మాగిల్. ఆమె 37 వారాల గర్భిణీ. ఆమెకది నాలుగోసారి గర్భం. కాబట్టి తన పిల్లలకు పుట్టబోయే పాపాయికి ఎలాంటి లోటు రాకూడదని నిర్ణయించుకుని ఈ మేరకు వంటలు చేసింది. ఆమె ఇలా వంటకాలు చేసిందని తెలుసుకున్న బంధువులు, ఇరుగుపొరుగువారు వచ్చి చూసి ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు. గర్భం ధరించాక చాలామంది మహిళలు ఇటు పుల్ల తీసి అటు వేయలేరు. అలాంటిది ఈమె ఏకంగా 380 రకాల వంటకాలు చేయడంపై అంతా మెచ్చుకుంటున్నారు. వీడియో చూడండి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఒక్క ఓటు కోసం.. 35 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రం..