Webdunia - Bharat's app for daily news and videos

Install App

శని దోషాలతో బాధపడేవారు.. నల్ల వంకాయలను..?

శని దోషాలతో బాధపడేవారు.. నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరమ్.. అనే స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. వీలైనంతసేపు ఏ పనిచేస్తున్నా ''ఓం నమ:శివాయ'' అనే పంచా

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (16:41 IST)
శని దోషాలతో బాధపడేవారు.. నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరమ్.. అనే స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. వీలైనంతసేపు ఏ పనిచేస్తున్నా ''ఓం నమ:శివాయ'' అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. పేదలకు అన్నదానం చేయాలి. ఇతురుల నుంచి ఇనుము, ఉప్పు, నువ్వులు, నువ్వులనూనె చేతితో తీసుకోకూడ‌దని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. 
 
మయూరి నీలం ధరించడం ద్వారా శనిదోషాలు తొలగించుకోవచ్చు. శనికి తైలాభిషేకం చేయించడం ద్వారా ఏలినాటి శనిదోషం తొలగిపోతుంది. శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో లేదా శివాలయంలో ప్రసాదాన్ని పంచాలి. ప్రతి రోజు నువ్వుల‌తో చేసిన ఉండ‌లు కాకులకు పెట్టాలి. శనివారం రోజు రొట్టిపై నువ్వుల నూనే వేసి కుక్కలకు ఆహారంగా ఇవ్వాలి. 
 
హనుమంతుడిని తప్పకుండా పూజించాలి. సుందరకాండ లేదా నల చరిత్ర చ‌దువుకోవాలి. బియ్యం ర‌వ్వలో పంచదార కలిపి చీమ‌ల‌కు పెట్ట‌డం కూడా మంచిదే. ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రదక్షిణం చేయాలి. బ్ర‌ాహ్మాణుల‌కు నల్ల వంకాయ, నల్ల నువ్వులు దానం చేయాలి. 
 
శ్రీ వేంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇవ్వడం,  ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దర్శ‌నం వల్ల శనిదోషాలు తొలగిపోతాయి. శివాలయంలో శివుని దర్శనం. హనుమంతుని ద‌ర్శ‌నం వ‌ల్ల‌ శని గ్రహ దోషం నివారించ‌వ‌చ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments