అన్నదోషమంటే ఏంటి..? ''శ్రీకృష్ణార్పణం'' అంటూ మూడుసార్లు?
పితృ దోషాలు, సర్పదోషాల తరహాలోనే అన్నదోషం అనేది వుంది. ఆకలి అని వచ్చిన వారికి అన్నం పెట్టకుండా.. వారిని గెంటేసి.. భుజించిన వారికి అన్నదోషం ఏర్పడుతుంది. ముఖ్యంగా గర్భిణీ మహిళలు ఆకలిగా వున్నప్పుడు వారికి
పితృ దోషాలు, సర్పదోషాల తరహాలోనే అన్నదోషం అనేది వుంది. ఆకలి అని వచ్చిన వారికి అన్నం పెట్టకుండా.. వారిని గెంటేసి.. భుజించిన వారికి అన్నదోషం ఏర్పడుతుంది. ముఖ్యంగా గర్భిణీ మహిళలు ఆకలిగా వున్నప్పుడు వారికి పక్కనబెట్టుకుని తమ కడుపు నింపుకునేవారికి ఈ దోషం తప్పక అంటుతుంది. ఇంకా భోజనం చేసేందుకు కూర్చున్న వ్యక్తులను లేచిపోయేలా చేసినవారికి అన్నదోషం తప్పదు.
ఇంట్లో ఆహారం వున్నప్పటికీ.. ఇతరులకు కాసింతైనా పంచకుండా భుజించే వారికి, ఆహారాన్ని చెత్తకుండీలో పారవేసేవారికి అన్నదోషం ఏర్పడుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. పితృదేవతలకు పిండ ప్రదానం చేయనివారికి, చిన్నారులకు అన్నం పెట్టకుండా ఆహారం తీసుకునేవారికి అన్నదోషం ఏర్పడుతుంది.
ఈ దోషమున్నవారికి ఎంత సంపాదించినా.. సంపద చేతిలో నిలువదు. అలాంటివారు శుక్రవారం ఒంటి పూట భోజనం చేసి అన్నపూర్ణమ్మను కొలవాలి. అలాగే శక్తి తగినట్లు అన్నదానం చేయడం ద్వారా ఈ దోషం తొలగిపోతుంది. అంతేగాకుండా సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.
అలాగే ఆహారం తీసుకునేటప్పుడు కాళ్లు చేతులు శుభ్రం చేసుకోవాలి. ఒక చేతిని నేలకు ఆనించి ఆహారం తీసుకోకూడదు. ఎడమచేతిలో ఆహారం వడ్డించకూడదు. ''శ్రీకృష్ణార్పణం'' అంటూ మూడుసార్లు ఉచ్ఛరించి ఆహారం తీసుకోవాలి. తూర్పు దిశగా కూర్చుని ఆహారం తీసుకుంటే.. ఆయుష్షు పెరుగుతుంది. ఉత్తర, దక్షిణ దిశల్లో కూర్చుని ఆహారం తీసుకోవడం అంత మంచిది కాదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.