21-04-2019 ఆదివారం దినఫలాలు

Webdunia
ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (09:46 IST)
మేషం: సహోద్యోగులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ జీవితభాగస్వామి సలహా పాటించడం వలన మేలు చేకూరుతుంది. తలపెట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. స్త్రీలు శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది.
 
వృషభం: చిన్నారులు, ఆత్మీయులకు మీరందించిన కానుకలు సంతోషపరుస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. సమయానికి అవసరమైన వస్తువు కనిపించకపోవచ్చు. తీర్థయాత్రలు ఉల్లాసాన్నిస్తాయి. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారం కావడంతో మానసికంగా కుదుటపడుతారు.
 
మిధునం: కుటుంబంలో అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమయానికి కావలసిన పత్రాలు, వస్తువులు కనిపించకపోవచ్చు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకులతో ఒక అవగాహన ఏర్పడుతుంది. 
 
కర్కాటకం: స్త్రీలకు ఆహ్వానాలు, వాహన యోగం వంటి ఫలితాలున్నాయి. వృత్తి వ్యాపారులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. అవివాహితుల్లో నూతనోత్సాహం చేటు చేసుకుంటుంది. గృహ మరమ్మత్తులు, మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభవార్త శ్రవణం. ఎలక్ట్రికల్ రంగాలవారికి లాభదాయకం.
 
సింహం: దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ముఖ్యులలో ఒకరి గురించి అప్రియమైన వార్తలు వింటారు. వేళతప్పి భోజనం, శారీరక శ్రమ వలన ఆరోగ్యం మందగిస్తుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి.
 
కన్య: ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో లౌక్యం అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. ఖర్చులు రాబడికి మించినా ఇబ్బందులుండవు. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. 
 
తుల: కష్టసమయంలో ఆత్మీయులు చేదోడు వాదోడుగా నిలుస్తారు. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు కలిసిరాగలదు. విదేశాలు వెళ్ళాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది.
 
వృశ్చికం: మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. క్రీడా, కళా, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి వహిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
ధనస్సు: విలువైన వస్తువుల కోసం ధనం ఖర్చుచేస్తారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. నిరుద్యోగ యత్నాలు ఒక కొలిక్కిరాగలవు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులతో గృహంలో సందడి కానవస్తుంది.  
 
మకరం: నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. రావలసిన ధనం కొంత ముందు వెనుకలగానైనా అందుతుంది. ముందుచూపుతో వ్యవహరించడం మంచిది. ప్రముఖులను కలుసుకుని సంప్రదింపులు జరుపుతారు. మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. 
 
కుంభం: బంధువుల రాక వలన ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తికావు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. పెద్దల ఆరోగ్యం నిరుత్సాహపరుస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. 
 
మీనం: స్త్రీలకు దూరప్రయాణాలలో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. సభలు, సమావేశాలు, వేడుకల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలుచేస్తారు. కుటుంబీకులతో విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతి పథంలో కొనసాగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

SIRతో జాగ్రత్త, స్టాలిన్, మమతా బెనర్జీ అందుకే ఓడిపోయారు, మనం మరో రకంగా ఓడాము: జగన్

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టే అధికారం ఈసీకి ఉంది : సుప్రీంకోర్టు

దేశంలో భానుడి భగభగలు... పౌరులకు ప్రధాని మోడీ సూచనలు

మహానాడు విధానం, స్ఫూర్తి మారలేదు.. కార్యకర్తలే బలం, బలగం.. చంద్రబాబు

2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

తర్వాతి కథనం
Show comments