Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18-04-2019 గురువారం దినఫలాలు

Advertiesment
18-04-2019 గురువారం దినఫలాలు
, గురువారం, 18 ఏప్రియల్ 2019 (08:47 IST)
మేషం: ఉద్యోగస్తులకు ప్రయాణాలలో ఎక్కువ చికాకులు ఇబ్బందులను ఎదుర్కుంటారు. రావలసిన ధనం అందడంతో మానసకంగా కుదుటపడుతారు. ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. విదేశీ వ్యవహారాలు, విద్య, రవాణా, ప్రణాళికలు, బోధన, ప్రకటనల రంగాలవారు ఆచితూచి వ్యవహరించండి.
 
వృషభం: పాత మిత్రులతో ఆనందంగా గడుపుతారు. దూరప్రయాణాలకై చేయు యత్నాలు ఫలిస్తాయి. భీమా, పెన్షన్, వ్యవహారాలు క్రయవిక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. దైవ, సేవా, పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తితో పాటు ధనం అధికంగా వెచ్చిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి.
 
మిధునం: అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వృత్తుల వారికి సదవకాశాలు, ప్రజాసంబంధాలు బలపడుతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. సహకార సంఘాలలో వారికి రాజకీయాలలో వారికి చికాకులు వంటివి తప్పదు.
 
కర్కాటకం: ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు వ్యవహరిస్తారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. బంధువుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం.
 
సింహం: మార్కెట్ రంగాలవారికి నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త రుణాలు, పెట్టుబడుల కోసం యత్నిస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. ఉమ్మడి కుటుంబ విషయాలలో మాటపడాల్సి వస్తుంది.
 
కన్య: సొంతంగా వ్యాపారం, సంస్థలు, పరిశ్రమలు నెలకొల్పాలనే ఆలోచన బలపడుతుంది. ఉద్యోగస్తుల బదిలీ యత్నాలు ఫలిస్తాయి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. రుణ బాధలు, దీర్ఘకాలిక సమస్యలు క్రమేణా సర్దుకుంటాయి. కార్యసాధనలో అనుకూలత, చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాగలవు. 
 
తుల: కొబ్బరి, పండ్లు, పానీయ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ శ్రీమతి సలహా పాటించి లబ్ది పొందుతారు. ప్రయాణాల్లో చికాకులు, ప్రయాసలు తప్పవు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనివారలతో చికాకులు, ఆరోగ్య సమస్యలు తప్పవు.
 
వృశ్చికం: ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. కాంట్రాక్టులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. ఆస్తి వ్యవహారాల్లో సోదరులతో అవగాహన ఏర్పడుతుంది. ప్రముఖుల సహకారంతో ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
ధనస్సు: సాహస ప్రయత్నాలు విరమించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. చిన్న చిన్న సమస్యలెదురైనా పరిష్కరించుకుంటారు. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఏదైనా స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్పురిస్తుంది.  
 
మకరం: వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. గృహోపకరణాలు, వాహనం సమకూర్చుకుంటారు. పాత మిత్రుల కలయికతో మీలో కొంత మార్పు వస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబీకులతో ఏకాభిప్రాయం కుదరదు. దైవ, సేవా, పుణ్య కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. 
 
కుంభం: నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు అనుకూలం. దూరంగా ఉన్న ఆత్మీయులను కలుసుకోవాలనే కోరిక స్పురిస్తుంది. ఒక కార్యం నిమిత్తం దూరప్రయాణం చేయవలసి వస్తుంది. మీ సంతానం విద్యా, వివాహ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. సోదరులతో ఆస్కిత విషయమై సంప్రదింపులు జరుపుతారు. 
 
మీనం: మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించవడం మంచిది కాదు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బలమే జీవితం, దౌర్బల్యమే మృత్యువు