Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

17-04-2019 - బుధవారం మీ రాశిఫలితాలు - మీ మీద నిందలు మోపే అవకాశం ఉంది..

17-04-2019 - బుధవారం మీ రాశిఫలితాలు - మీ మీద నిందలు మోపే అవకాశం ఉంది..
, బుధవారం, 17 ఏప్రియల్ 2019 (09:31 IST)
మేషం: ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. నూతన గృహం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రులను కలుసుకుని వారితో ఉల్లాసంగా గడుపుతారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. 
 
వృషభం: ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతుంది. కుటుంబంలోని కొన్ని మార్పులు భావోద్వేగాలకు గురిచేస్తాయి. బంధువులను కలుసుకుంటారు. ఆటోమోబైల్, రవాణా, మోకానికల్ రంగాల్లో వారికి చికాకు తప్పదు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. 
 
మిధునం: న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు, స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. మీరు చేయని కొన్ని పనులకు మీ మీద నిందలు మోపే అవకాశం ఉంది. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం: బ్యాంకులు, లావాదేవీలకు అనుకూలం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. బోకర్లకు, ఏజెంట్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒత్తిడి తప్పదు. కొన్ని బంధాలను నిలుపు కోవడానికి కష్టపడాల్సి వస్తుంది.
 
సింహం: వ్యాపారస్తులు దస్త్రం వ్యవహారంలో క్షణం తీరిక ఉండదు. పత్రికా, ప్రైవేటు సంస్థల్లోనివారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు ఊహించిన చికాకులు ఎదురవుతాయి.
 
కన్య: షాపింగ్‌లో దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎదుటివారి తీరును గమనించి ముందుకు సాగండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కిరణా, ఫ్యాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి ఆశాజనకం. 
 
తుల: వ్యాపారుల ఆలోచనులు దస్త్రం దిశగా సాగుతాయి. సహోద్యోగుల కారణాల వలన మీ కార్యక్రమాలు వాయిదా పడుతాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చేపట్టిన పనులు సక్రమంగా నిర్వర్తించలేకపోవడం వలన ఒకింత ఒత్తిడికి గురవుతారు. పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. 
 
వృశ్చికం: రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. మీరు చేసే పనులవై ఇతరుల దృష్టి ఉంటుంది. జాగ్రత్త వహించండి. స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు వంటివి ఎదుర్కోక తప్పదు. ఉద్యోగస్తులకు పనిభారం, అధిక ఒత్తిడి తప్పదు. దూరప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. 
 
ధనస్సు: ఆర్థిక విషయాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తారు. సోదరీసోదరులతో అవగాహన కుదరదు. స్త్రీలతో సంభాషించునపుడు సంయమనం పాటించండి. అన్నీ లాభదాయకంగానే ఉంటాయి. మీకు నచ్చిన విషయాలపై దృష్టి పెడతారు. బంగారు, వెండి, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
మకరం: పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. తొందరపడి వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. నిర్మాణ పథకాలలో సంతృప్తి కానవచ్చును. ఎదురుచూడని అవకాశాలు దగ్గరకు వస్తాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. 
 
కుంభం: స్త్రీల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. ఉపాధ్యాయ రంగాల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిది. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. నూతన వ్యాపారాల పట్ల దృష్టి సారిస్తారు. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. గృహంలో సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. 
 
మీనం: ఆలయ సందర్శనాల కోసం ధనం బాగుగా ఖర్చుచేస్తారు. మొండిబాకీలు సైతం వసూలుకాగలవు. కొన్ని సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్యం ఎదుర్కుంటారు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహన చోదకులకు అప్రమత్తత అవసరం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలకు పొంచి ఉన్న నీటి ముప్పు..