14-04-2019 ఆదివారం రాశి ఫలితాలు.. తొందరపడి వాగ్దానాలు చేసి?

ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (10:19 IST)
మేషం: ఉద్యోగస్తులు తొందరపడి సంభాషించటంవల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఓ వార్త కలవర పెడుతుంది. ఖర్చులు అంతగా లేకున్నా ధన వ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. దైవ కార్యక్రమాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
వృషభం: తొందరపడి వాగ్దానాలు చేసి ఇబ్బందులకు గురికాకండి. టెక్నికల్, కంప్యూటర్, వైజ్ఞానిక రంగాల వారికి అనుకూలం. శ్రీవారు, స్రీమతి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. అనుకున్న నిధులు చేతికి అందుతాయి. వసతి ఏర్పాట్ల విషయంలో చిక్కులు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు, చర్చల్లో అంచనాలు ఫలించక పోవచ్చు.
 
మిధునం: బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కలవరపెడతాయి. సహోద్యోగులతో అనుబంధాలు బలపడతాయి. భాగస్వాములతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్లు, కూరగాయలు, పూల వ్యాపారస్తులకు లాభదాయకం. స్త్రీలు గృహానికి కావలసిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
 
కర్కాటకం: ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. వృత్తి, వ్యాపారాల వారికి ఆటంకాలు తొలగిపోతాయి. టెక్నికల్, విద్యా, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్త్రీలు బంధువులను కలుసుకుంటారు. పట్టు, చేనేత, ఫ్యాన్సీ, బంగారం, వెండి వ్యాపారులకు కలసివచ్చే కాలం.
 
సింహం: నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. తెలిసి తెలియక చేసిన పనులు ఇబ్బందుల్ని తెచ్చి పెడతాయి. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. దైవ, సేవా, పుణ్య కార్యాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
కన్య: ఆర్థిక వ్యవహారాలు, నూతన పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. సన్నిహితులతో కలిసి బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. ఆదాయం బాగున్నా ఏదో తెలియని అసంతృప్తి, అసహనానికి లోనవుతారు.
 
తుల: వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు అధికారుల వేధింపులు అధికం అవుతాయి. మీ సంతానం భవిష్యత్తు కోసం నూతన పథకాలు చేపడతారు. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహనా లోపం, చికాకులు అధికం అవుతాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి.
 
వృశ్చికం: విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి కాగలవు. మీ యత్నాలకు ప్రముఖుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కొత్తగా చేపట్టబోయే వ్యాపారాలు, సంస్థలకు కావలసిన పెట్టుబడి సర్దుబాటు కాగలదు.
 
ధనస్సు: నిరుద్యోగుల ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు కలసిరాగలదు. ప్రేమికులకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. విలాస వస్తువులు, వాహనం అమర్చుకుంటారు.
 
మకరం: విద్యార్థులు ఇతరుల కారణంగా మాటపడాల్సి వస్తుంది. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్తగా చేపట్టబోయే వ్యాపారాలు, సంస్థలకు కావలసిన పెట్టుబడి సర్దుబాటు కాగలదు. భార్యా భర్తల మధ్య విబేధాలు తలెత్తవచ్చు.
 
కుంభం: కిరాణా, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. చిరు వ్యాపారులకు, చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి కలసిరాగలదు. విదేశీయానం కోసం చేసే యత్నాలకు అడ్డంకులు తొలగిపోగలవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రతా లోపంవల్ల పై అధికారుల నుంచి మాటపడాల్సి వస్తుంది.
 
మీనం: ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి లాభదాయకం. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉపాధ్యాయులకు అధిక శ్రమ, ఒత్తిడి తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. నిరుద్యోగులకు మధ్యవర్తులపట్ల అప్రమత్తత అవసరం. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడటం మంచిది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 14-04-2019 నుంచి 20-04-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)