10-04-2019 బుధవారం దినఫలాలు - కుటుంబీకుల కోసం...

బుధవారం, 10 ఏప్రియల్ 2019 (08:54 IST)
మేషం: జాయింట్ వ్యాపారస్తులకు తోటివారితో మెళకువ అవసరం. కంది, నూనె, మిర్చి వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది. గృహిణీలకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. ఖర్చుకు వెనకాడకుండా విలువైన వస్తువులు సేకరిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, నగదు అవార్డు వంటి శుభ సంకేతాలున్నాయి.
 
వృషభం: వ్యాపారాల్లో పోటీనీ దీటుగా ఎదుర్కుంటారు. క్రయవిక్రయాలు ఊపందుకుంటాయి. తలపెట్టిన పనులు వేగవంతంగా పూర్తిచేస్తారు. వ్యవహార ఒప్పందాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. పత్రికా రంగంలోని వారికి రచయితలకు అనువైన సమయం. రిజిస్ట్రేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు అనుకూలిస్తాయి.
 
మిధునం: ప్రభుత్వం నందు పనిచేయు ఉద్యోగులకు లాభములు చేకూరును. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు అధికమవుతాయి. నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో మెళకువ అవసరం. ప్రముఖులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడుతాయి.
 
కర్కాటకం: వ్యాపారాల్లో నష్టాలు తొలగి లాభాలు గడిస్తారు. ధైర్యంతో యత్నాలు సాగిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గతంలో వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
 
సింహం: ఉద్యోగస్తులు మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ ఆలోచనల్లో కొంతమార్పు వస్తుంది. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలతో అందరినీ ఆకట్టుకుంటారు.
 
కన్య: వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. విదేశాలు వెళ్ళడానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆప్తుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. కళ, క్రీడా కారులకు ప్రోత్సాహకరం. విందులు, వినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. బంధువులతో విభేదాలు, పట్టింపులు తలెత్తుతాయి.  
 
తుల: కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ప్రస్తుత వ్యాపారాలపై శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు.
 
వృశ్చికం: వ్యాపారాల్లో నష్టాలు తొలగి లాభాలు గడిస్తారు. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం. అధికారులు ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. 
 
ధనస్సు: ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు, కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. ఎరువుల వ్యాపారులు, రేషన్ డీలర్లకు అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. దైవకార్యం, విందుల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. క్యాటరింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. 
 
మకరం: బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. క్యాటరింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ఉద్యోగయత్నంలో సఫలీకృతులవుతారు. వాణిజ్య ఒప్పందాలు, నగదు చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. వృత్తుల వారికి కలిసిరాగలదు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. 
 
కుంభం: బంధుమిత్రులు మొహమ్మాటానికి గురిచేస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. కోర్టు ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. వాహన చోదకులకు దూకుడు తగదు. ఆలోచనలు కార్యారూపం దాల్చుతాయి. 
 
మీనం: ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం అందుతుంది. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్యం, చికాకులు ఎదుర్కుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణకు అనకూలం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సహజ శిలా వెంకన్న శిల్పానికి మేలు చేస్తున్నామా...? కీడు చేస్తున్నామా...?