Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-04-2019 - శనివారం మీ రాశి ఫలితాలు.. ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం?

Advertiesment
06-04-2019 - శనివారం మీ రాశి ఫలితాలు.. ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం?
, శనివారం, 6 ఏప్రియల్ 2019 (10:15 IST)
మేషం: ముందుచూపుతో వ్యవహరించి ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. శ్రమాధిక్యత, అకాల భోజనం వలన ఆరోగ్యం మందగిస్తుంది. అతిధ మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. ఫ్యాన్సీ, బేకరీ, పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి. ఆలయాలను సందర్శిస్తారు. 
 
వృషభం: దైవ, సేవా సంస్థలకు విరాళాలివ్వడం వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు నిరుత్సాహపరుస్తాయి. హోటల్, తినుబండారాలు, బేకరీ, పండ్ల వ్యాపారులకు లాభదాయకం. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. స్త్రీలకు చుట్టుప్రక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
మిధునం: విద్యార్థులు తోటివారి కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. కొంతమంది మీ నుండి విషయాలు రాబట్టేందుకు యత్నిస్తారు. దైవ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తప్పవు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం.
 
కర్కాటకం: ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. మీ శ్రమ, యత్నాలు వృధాకావు. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. మీ అభిప్రాయం సున్నితంగా వ్యక్తం చేయడం శ్రేయస్కరం. స్త్రీలతో సంభాషించేపుడు సంయమనం పాటించండి. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి.
 
సింహం: ప్రేమికులు అనాలోచితంగా వ్యవహరించడం వలన చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. బంధువులను కలుసుకుంటారు. ఊహించని ఖర్చులు వలన చేబదుళ్ళు తప్పవు. పెద్దల పరోపకారానికి పోవడం వలన మాటపడవలసి వస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. విందులు, వినోదాల్లో అపశృతులు దొర్లే అవకాశం ఉంది.
 
కన్య: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. శ్రీవారు, శ్రీమతి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. మీ లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల ముఖ్యమని గమనించండి. ఇతరుల వ్యవహారాలలో మౌనం పాటించడం మంచిది. 
 
తుల: భాగస్వామ్యుల మధ్య నూనత ఆలోచనలు స్పురిస్తాయి. ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు ఆందోళన కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. వాహన విషయంలో సంతృప్తి కానవస్తుంది. అదనపు రాబడి కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు.
 
వృశ్చికం: స్త్రీలు నూతన వస్త్రాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. రాజకీయ నాయకులు తరచు సభ, సమావేశాలలో పాల్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. 
 
ధనస్సు: కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగుల భవిష్యత్ గురించి పథకాలు వేసిన సత్ఫలితాలు పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందడం వలన ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. మీ సంతానం వలన ఆనందం, ఉత్సాహం పొందుతారు. స్త్రీలు ప్రముఖుల సిఫార్సుతో దైవ దర్శనాలను తొరగా ముగించుకుంటారు. 
 
మకరం: కుటుంబీకుల నుండి సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. స్త్రీలకు బంధువర్గాల నుండి ఆశ్చర్యకరమైన వార్తలు అందుతాయి. సమయానికి సహకరించి వ్యక్తుల పట్ల ఇబ్బందులెదుర్కుంటారు. 
 
కుంభం: స్త్రీలు ఇరుగు, పొరుగు వారితో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. మీకు దగ్గరగా ఉన్న మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. బంధుమిత్రుల రాకపోకులు అధికమవుతాయి. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయడం మంచిది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. 
 
మీనం: ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. ఒకేసారి అనేక పనులు మీద పడడంతో ఒత్తిడికి గురవుతారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. మీ ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి సద్వినియోగం చేసుకోండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చి 6 వికారి నామ సంవత్సర ఉగాది... ఏ సమయంలో పచ్చడి తినాలి?