Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

02-04-2019 మంగళవారం దినఫలాలు - ఆ వృత్తుల వారి శ్రమకు...

webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (08:08 IST)
మేషం: వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. రుణయత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి.
 
వృషభం: ఆహార వ్యవహారాలలో మెళకువ అవసరం. పత్రికా, ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. క్రీడా, కళా రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల ప్రాపకం సంపాదిస్తారు. కాంట్రాక్టర్లు రావలసిన బిల్లులు మంజూరుకాగలవు.
 
మిధునం: ఆడిట్, అకౌంట్స్ రంగాలవారికి ఏకాగ్రత అవసరం. ఆదాయ వ్యయాలలో ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తారు. మార్కెటింగ్ రంగాలవారికి, ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. వైద్య శిబిరంలోని వారు తరచు ఒత్తిడులకు గురవుతారు.
 
కర్కాటకం: ఎల్.‌‍ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. క్రయవిక్రయాలు లాభదాయకం. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ వహించండి. స్త్రీలకు ఆరోగ్యపరంగాను, ఇతరత్రా చికాకులు ఎదుర్కోక తప్పదు. పనిచేసే చోట కొన్ని మార్పులు సంభవిస్తాయి. అధికారులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి.
 
సింహం: ఎప్పటి నుండో మీరు అనుకుంటున్న కలలు నిజమయ్యే సమయం దగ్గర పడనుంది. సంఘంలో ఆదర్శజీవనం జరుపుతారు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఊహగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలం సద్వినియోగం చేసుకోండి. మీరు అభిమానించే వ్యక్తి మంచి ప్రసంసలు పొందుతారు.
  
కన్య: ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతి పథంలో కొనసాగుతాయి. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో బహు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు అధికారులతో మాటపడకుండా తగిన జాగ్రత్త వహించండి. 
 
తుల: ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగల వారికి ఆశాజనకం. స్త్రీలు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలించవు. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్థిరచరాస్తుల క్రయవిక్రయాల్లో చేయు యత్నాలు ఫలించవు. నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. గృహానికి కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు.
 
వృశ్చికం: ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగును. పాతమిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. ముఖ్యుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. 
 
ధనస్సు: ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. ధనియాలు, ఆవాలు, పసుపు, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలదు. మీకు నచ్చిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. మీరు అమితంగా అభిమానించే వ్యక్తులే మిమ్ములను మోసగిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం, అధిక ఒత్తిడి తప్పదు. 
 
మకరం: ఆత్మీయులతో కలిసి విహార యాత్రలలో పాల్గొంటారు. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. వృత్తి, వ్యాపారాలలో శుభపరిణామాలు సంభవిస్తాయి. 
 
కుంభం: చిన్న తరహా పరిశ్రమలలో వారికి అనుకూలత. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరులు చెప్పిన మాటపై దృష్టి పెట్టండి. 
 
మీనం: గృహోపకరణాలు కొనుగోలుచేస్తారు. వాణిజ్య ఒప్పందాలు, వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. సందర్భానుకూలంగా సంభాషించి సమస్యలకు దూరంగా ఉండండి. కార్యాలయంలో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

శివలింగంలో నీరు ఉన్న ఆలయం ఏది?