29-03-2019 - శుక్రవారం మీ రాశిఫలితాలు - కళలకు సంబంధించిన పోటీలలో రాణిస్తారు..

శుక్రవారం, 29 మార్చి 2019 (09:48 IST)
మేషం: ఉద్యోగస్తులకు అధికారులతో చికాకులు ఎదురవుతాయి. విద్యార్థినులలో మానసిక ధైర్యం, సంతృప్తి చోటు చేసుకుంటుంది. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. షాపు గుమస్తాలు, పనివారలను ఓ కంట కనిపెట్టండి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిష్కరింపబడుతాయి.
 
వృషభం: కాంట్రాక్టర్లకు ప్రభుత్వ అధికారులతో సమస్యలు తలెత్తగలవు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. స్త్రీలకు తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. వ్యాపారాల్లో ఆకర్షణీయమైన పథకాలతో వినియోగదారులను ఆకట్టుకుంటారు. ధనసహాయం అర్థించడానికి అభిజాత్యం అడ్డువస్తుంది.
 
మిధునం: కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత, పునఃపరిశీలన ముఖ్యం. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. స్త్రీలు రచనా వ్యాసంగాలు, కళలకు సంబంధించిన పోటీలలో రాణిస్తారు.
 
కర్కాటకం: విదేశీయానం కోసం చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. మీ వాక్‌చాతుర్యం అందరినీ ఆకట్టుకుంటుంది.
 
సింహం: వృత్తి, వ్యాపారాల్లో గణనీయమైన మార్పులు ఉంటాయి. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడుతాయి. వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కొనవలసివస్తుంది.
 
కన్య: ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన పురోభివృద్ధి ఉండదు. కుటుంబంలో అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఉత్తర, ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. సోదరీసోదురుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. 
 
తుల: ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా ఒత్తిడి, పనిభారం తప్పవు. ఏకాగ్రత లోపం, చంచలత్వం వలన విద్యార్థులకు ఒత్తిడి, మందలింపులు తప్పవు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ధనం వృధాగా వ్యయం కావడం మినహా పెద్దగా ఫలితం ఉండదు. అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలోని వారికి చికాకులు అధికమవుతాయి. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఋణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడుతారు. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
ధనస్సు: వస్త్రం, బంగారు, వెండి వ్యాపారస్తులకు తోటివారితో మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. భాగస్వామిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలకు ఇతోధికంగా సహకరిస్తారు. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మకరం: అనురాగ వాత్సల్యాలు పెంపొందగలవు. వ్యాపారాల విస్తరణలు, నూతన పెట్టుబడులకు అనుకూలం. విద్యార్థుల లక్ష్యం పట్ల ఏకాగ్రత, స్థిరబుద్ధి నెలకొంటాయి. మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విచ్చల విడిగా వ్యయం చేస్తారు. ఒక కార్యం నిమిత్తం మీరు చేసే పనికి ఇతరులు ఆటంకం కలిగించేందుకు యత్నిస్తారు. 
 
కుంభం: హోటల్, క్యాటరింగ్ పనివారలకు ఆర్థికాభివృద్ధి విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. ఒక కార్యం నిమిత్తం మీరు చేసే పనికి ఇతరులు ఆటంకం కలిగించేందుకు యత్నిస్తారు. 
 
మీనం: స్త్రీలు రచనా వ్యాసంగాలు, కళలకు సంబంధించిన పోటీలలో రాణిస్తారు. మీ అజాగ్రత్త వలన విలువైన వస్తువుల చేజారిపోయే ఆస్కారం ఉంది. కొత్త భాగస్వాముల విషయంలో అప్రమత్తంగా మెలగండి. ప్రేమికుల మధ్య ఇతరుల వలన విభేదాలు తలెత్తుతాయి. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మొగిలీశ్వరుడిని పూజిస్తే.. ఈ క్షేత్రంలో వివాహం చేసుకుంటే?