16-04-2019 మంగళవారం దినఫలాలు - మిథునరాశివారికి మధ్యవర్తిత్వాల్లో...

మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (08:51 IST)
మేషం : ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. నిరుద్యోగులకు నిరంతర కృషి అవసరం అని గమనించండి. సన్నిహితులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
వృషభం : స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. సొంత వ్యాపారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు స్నేహ బృందాలు విస్తరిస్తాయి. కుటుంబీకులతో పరస్పర అవగాహనాలోపం, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. చేపట్టిన పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఓర్పు, సంయమనం అవసరం.
 
మిథునం : ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు బంధుమిత్రులలో గుర్తింపు, రాణింపు లభిస్తాయి. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపట్ల ఏకాగ్రత వహించలేరు. క్రయ విక్రయ రంగాలలోని వారికి అనుకూలత. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు కృషి ఫలిస్తుంది.
 
కర్కాటకం : కంప్యూటర్, టెక్నికల్ రంగాలలోని వారికి కలసివచ్చే కాలం. దూర ప్రయాణాలలో స్త్రీలు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం. రుణం చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. మీ సహాయం పొంది మిమ్మల్ని తక్కువ అంచనా వేసేవారు అధికం అవుతారు.
 
సింహం : స్త్రీలు షాపింగ్‌ల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. చిన్నతరహా, చిరు వృత్తుల్లోని వారికి లాభదాయకం. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడంవల్ల దేనిమీదా ఏకాగ్రత వహించలేరు. ఏజెంట్లకు, బ్రోకర్లకు, వ్యాపారస్తులకు కలసివచ్చే కాలం. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినా జారవిడచుకుంటారు.
 
కన్య : దైవ, పుణ్య కార్యాలకు విరివిగా ధనం వ్యయం చేస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. మీ ఆలోచనలు, పథకాల్లో గోప్యం పాటించండి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
 
తుల : తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సాంస్కృతిక, సాహిత్య సదస్సులలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలపట్ల సంతృప్తి కానవస్తుంది. నిరుద్యోగులకు దూరప్రాంతాల నుంచి అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగంలోని వారికి ఒడిదుడుకులు తప్పవు. బంధుమిత్రుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
వృశ్చికం : ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వస్త్ర వ్యాపారులకు శుభదాయకం. ఆత్మీయుల నుంచి కానుకలు అందుకుంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఫ్యాన్సీ, గృహోపకరణాల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేతి వృత్తుల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. మీ బంధువుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.
 
ధనస్సు : నిరుద్యోగుల యత్నాలు కలసి రాగలవు. అవివాహితులకు అనుకున్న సంబంధాలు కుదురుతాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. ఊహించని ఖర్చులు అధికం కావటంతో స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. కొబ్బరి, పండ్లు, పూల, నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలసివస్తుంది. వాహన చోదకులకు ఇక్కట్లు తప్పవు.
 
మకరం : స్త్రీలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి కలుగుతుంది. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. గృహ నిర్మాణ మరమ్మత్తులు అనుకూలిస్తాయి. ప్రేమికులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఒక వ్యవహారంలో మీ బంధువుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.
 
కుంభం : మీ అలవాట్లు, బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. స్త్రీల అభిప్రాయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది. రావలసిన మొత్తం కొంత ముందు వెనుకలుగానైనా అందటంవల్ల ఇబ్బందులు ఉండవు. ప్రియతముల రాక మీకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. విహార యాత్రలలో చురుకుగా పాల్గొంటారు.
 
మీనం : వృత్తుల వారికి ఆర్థిక సంతృప్తి ఆశించినంత ఉండదు. భాగస్వామిక ఒప్పందాల్లో మీ ప్రతిపాదనలకు వ్యతిరేకత ఎదురవుతుంది. వైద్య రంగంలోని వారికి ఏకాగ్రత ఎంతో ముఖ్యం. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తి చేస్తారు. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 15-04-2019 సోమవారం దినఫలాలు - మేష రాశివారు ఇలా మసలుకోండి..