Webdunia - Bharat's app for daily news and videos

Install App

20-04-2019 శనివారం దినఫలాలు - వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు...

Webdunia
శనివారం, 20 ఏప్రియల్ 2019 (09:10 IST)
మేషం: చిన్న తరహా పరిశ్రమల వారికి సామాన్యంగా ఉండగలదు. పాత మిత్రులను కలుసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికల గురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు. చేపట్టిన పనులు సక్రమంగా నిర్వర్తించలేకపోతారు. సంతానం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ప్రేమికుల ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి.
 
వృషభం: ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. మితమీరిన ఆలోచనలు, శ్రమాధిక్యత వలన స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలు అపరిచితులతో మితంగా సంభాషించడం క్షేమదాయకం.
 
మిధునం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. మీ ఓర్పు, నేర్పులకిది పరీక్షా సమయం. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించండి. ఖర్చులు ప్రయోజనకంగా ఉంటాయి. స్థిరచరాస్తుల క్రయవిక్రయాల్లో ప్రతికూలత ఎదుర్కుంటారు. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. 
 
కర్కాటకం: గృహం ఏర్పరచుకోవాలనే కోరిక బలపడుతుంది. విద్యార్థినులలో ఏకాగ్రత లోపం వలన ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. అవివాహితులకు ఆశించిన సంబంధాలు నిశ్చయం కాగలవు. కుంటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. గతంలో ఒకరికిచ్చిన హామీ వలన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
 
సింహం: వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. మీ సొంత విషయాల్లో ఇతరుల జోక్యం చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తుల హోదా పెరగడంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. నూతన పెట్టుబడులకు మరికొంత కాలం వేచి ఉండడం శ్రేయస్కరం. కాంట్రాక్టుల విషయంలో ఏకాగ్రత వహించండి.
 
కన్య: మీ ఔన్నత్యాన్ని ఇతరులు గుర్తిస్తారు. వాగ్విదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. విద్యార్థులకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులకు రావలసిన గ్రాట్యూటీ, ఇతర అలవెన్సులలో జాప్యం తప్పదు. నిరుద్యోగులు ఉపాథి పథకాల్లో నిలదొక్కుకుంటారు.  
 
తుల: ఉమ్మడి వ్యవహారాలు, ఆస్తి పంపకాలు ఒక కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బాకీల వసూళ్ళల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
వృశ్చికం: వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. పదవీ వివరణ చేసిన ఉద్యోగస్తులకు తోటివారు సాదర వీడ్కోలు పలుకుతారు. పారిశ్రామిక రంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. 
 
ధనస్సు: కొబ్బరి, పండ్లు, పూల, నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. విద్యా కలయిక సంతోషపరుస్తుంది. మీరు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. 
 
మకరం: వ్యాపారాల విస్తరణలు, నూతన పెట్టుబడులకు అనుకూలం. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యకాభిమానం కలుగుతుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. రహస్య విరోధులు అధికం కావడం వలన రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. 
 
కుంభం: వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. స్త్రీలకు అలంకరణలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. షేర్ల క్రయవిక్రయాలు లాభిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. 
 
మీనం: ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలకై ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. మీ అత్యుత్సాహం అనర్ధాలకు దారితీస్తుంది. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్ మరింత ఆలస్యమయ్యే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే పార్టీలో చేరాను : విజయశాంతి

పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా... ఎవరికీ చెక్ పెడతామండీ : మంత్రి నాదెండ్ల

ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతుదారుల ఆందోళన... సర్దిచెప్పిన మాజీ ఎమ్మెల్యే!!

ఎయిర్ ఇండియా విమానం.. ఆకాశంలో గంటల పాటు చక్కర్లు.. మరుగు దొడ్ల సమస్యతో? (Video)

తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న అఘోరీని అర్థరాత్రి చితకబాదిన రాజేష్

అన్నీ చూడండి

లేటెస్ట్

Yadagirigutta: టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు ట్రస్టు బోర్డు

07-03-2025 శుక్రవారం దినఫలితాలు- సంతోషకరమైన వింటారు. మీ కష్టం ఫలిస్తుంది..

తితిదే అన్నప్రసాదంలో అవి గారెలా? వడలా?: తితిదే ఛైర్మన్‌కి ప్రశ్నల వర్షం

ఈ రంజాన్ మాసంలో దుబాయ్‌లో ఐదు ముఖ్యమైన ఇఫ్తార్ ప్రదేశాలు

శని - రాహువు కలయిక.. అశుభ యోగం.. కన్య, ధనుస్సు రాశి వారు జాగ్రత్త!

తర్వాతి కథనం
Show comments