Webdunia - Bharat's app for daily news and videos

Install App

18-10-2018 గురువారం దినఫలాలు - మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా....

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (10:42 IST)
మేషం: దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. స్త్రీలు ఇరుగు, పొరుగు వారిని విందులకు ఆహ్వానిస్తారు. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానవస్తుంది. విద్యుత్ కారణాల వలన సకాలంలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. 
 
వృషభం: మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆత్మీయులకు విలువై కానుకలందిస్తారు. మీ ఆంతరంగిక, వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. స్త్రీలు ప్రతి విషయంలో ఆలోచించి నడుచుకోవడం అన్ని విధాలా మంచిది. మీ అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు.  
 
మిధునం: మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. వాహన చోదకులకు ఆటంకాలు టీవీ కార్యక్రమాలల్లో రాణిస్తారు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు విస్తరిస్తాయి. వాహన చోదకులకు ఆటంకాలు తప్పవు. మీ సంతానం ఉన్నతికి మంచి పథకాలు రూపొందిస్తారు. బంధువుల వ్యాఖ్యానాలు మనస్తాపం కలిగిస్తాయి.   
 
కర్కాటకం: ప్రముఖులను వేడుకలకు ముఖ్య అతిధులుగా ఆహ్వానిస్తారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. సాహన ప్రయత్నాలు విరమించండి. స్త్రీలకు అయిన వారి నుండి ఆదరణ లభిస్తుంది. సొంత వ్యాపారాలు, వ్యాసారాల విస్తరణలు త్వరలోనే అనుకూలిస్తాయి. దైవ కార్యాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
సింహం: వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. ప్రతి విషయం మీ జీవిత భాగస్వామికి తెలియచేయటం మంచిది. బంధుమిత్రుల నుండి ఒత్తిడి, మెుహమ్మాటాలు ఎదుర్కుంటారు. ప్రేమికుల అనాలోచిత నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.  
 
కన్య: మీ శ్రీమతి పోరుతో కొత్త యత్నాలు మెుదలుపెడతారు. ఇంటా, బయటా మీ మాటకు ఆదరణ లభిస్తుంది. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ ధ్యేయం నెరవేరుతుంది. ప్రముఖులతో కీలకమైన సమావేశాల్లో పాల్గొంటారు. కార్యసాధనలో ఆటంకాలు తొలగిపోతాయి.  
 
తుల: పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. తొందరపాటు నిర్ణయాల వలన కష్టానష్టాలు చవి చూడాల్సి వస్తుంది. స్త్రీలకు విలువైన వస్తువులు, గృహోపకరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కళా, క్రీడా, సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ వహించండి.    
 
వృశ్చికం: ఒక వేడుకను ఘనంగా నిర్వహించి మంచి పేరు, ఖ్యాతిని పొందుతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. మీ ఏమరుపాటుతనం వలన విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. కుటుంబంలో అనురాగవాత్సల్యాలు బలపడుతాయి.  
 
ధనస్సు: ఆర్థిక లావాదేవీల్లో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ అభిరుచి, ఆశయాలకు సంబంధించిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. ఏ పని మెుదలెట్టినా విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆత్మీయులు, సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ఎంతో అవసరం.  
 
మకరం: స్త్రీలు ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. బాధ్యతలు పెరిగినా మీ సమర్థతను నిరూపించుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. సన్నిహితులతో కలిసి విందులు, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. లౌక్యంగా వ్యవహరించి ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. చేతిలో ధనం నిలబడడం కష్టమే.
 
కుంభం: రవాణా రంగాల వారికి ప్రయాణికులతో సమస్యలు తలెత్తుతాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. బంధువులరాకతో గృహంలో సందడి కానవస్తుంది. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది.     
 
మీనం: ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. విందులలో పరిమి పాటించండి. విలేఖరులకు, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల వారికి చికాకులు తప్పవు. బంధువుల రాకతో ఊహించన ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ఏ మాత్రం పొదుపు సాధ్యం కాదు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

కేసీఆర్ పుట్టిన రోజు : ఫ్లెక్సీలను తొలగించండి.. (Video)

బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ కేశినేని నాని..?

కిడ్నీదానం చేసి భర్తను బతికించుకున్న మహిళ.. లారీ రూపంలో మృత్యువు వెంటాడింది...

అన్నీ చూడండి

లేటెస్ట్

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

15-02-2025 శనివారం రాశిఫలాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

అలాంటి వాడిది ప్రేమ ఎలా అవుతుంది? అది కామం: చాగంటి ప్రవచనం

తర్వాతి కథనం
Show comments