Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

15-10-2018 సోమవారం దినఫలాలు - శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం...

webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (09:07 IST)
మేషం: పత్రికా రంగాల వారికి శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. ఆకస్మికంగా బిల్లులు, ఫీజులు చెల్లిస్తారు. రాజకీయనాయకులకు సభలు, సమావేశాలలో సంభాషించునపుడు మెళకువ అవసరం. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి.   
 
వృషభం: భాగస్వామిక వ్యాపారాల నుండి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. సోదరీసోదరుల మధ్య మనస్పర్ధలు, చికాకులు తలెత్తుతాయి. మీ మేలు పొందిన వారే మీపై అభాండాలు వేసేందుకు యత్నిస్తారు. ప్రముఖుల కలయిక వాయిదా పడుతుంది. దైవ సేవా కార్యక్రమాలకు ధనం విపరీతంగా వ్యయం చేస్తారు.   
 
మిధునం: శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఉద్యోగస్తులు ప్రభుత్వాధికారులతో చర్చల్లో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తుల దైనందికన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. ఎంతోకొంత పొదుపు చేయాలన్న మీ ఆలోచన ఫలించదు.   
 
కర్కాటకం: రాజకీయాల వారికి రహస్యపు విరోధులు అధికమవుతున్నారని గమనించండి. దూరప్రయాణాలలో మెళకువ అవసరమని గమనించండి. ఉద్యోగస్తులకు బోనస్, పండుగ అడ్వాన్స్‌లు మంజూరుకాగలవు. సోదరీసోదరులతో సంబంధబాంధవ్యాలు సామాన్యంగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు.  
 
సింహం: వ్యాపారాల్లో నష్టాలను నిదానంగా పూడ్చుకోగల్గుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహా తీసుకోవడం ఉత్తమం. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో చికాకులు అధికం. బంధువులు ఆకస్మిక రాక ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు.   
 
కన్య: ఉద్యోగ, వ్యాపారాల్లో బాగుగా రాణిస్తారు. తలపెట్టిన పనులు నెమ్మదిగా పూర్తిచేస్తారు. బంధువుల నుండి కొద్దిపాటి చికాకులను ఎదుర్కుంటారు. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. పెద్దలతో సంభాషించునపుడు మెళకువ అవసరం. పాతమిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తి చేసుకుంటారు.  
 
తుల: ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఊహించని రీతిలో ప్రయాణాలు చేస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలించవు.   
 
వృశ్చికం: ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయంలో ఏకాగ్రత వహించండి. దంపతుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. అపార్థాలు మాని ఇతరులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి.  
 
ధనస్సు: వ్యాపారాల్లో నష్టాలను కొంతమేరకు అధికమిస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తుంది. మీ సోదరుని మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. నూతన పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
మకరం: ప్రైవేటు సంస్థలలోని వారి మార్పులకై చేయు యత్నాలలో ఆటంకాలు తప్పవు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. అకాల భోజనం, మితమీరిన శ్రమ వలన ఆరోగ్యం మందగిస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి.  
 
కుంభం: కళా, క్రీడా, సాంకేతిక రంగాలవారికి ప్రోత్సాహకరం. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికం. విద్యార్థుల అత్యుత్సాహం వలన చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మీ హోదాకు తగినట్టుగా ధనం వ్యయం చేయవలసి వస్తుంది. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు.  
 
మీనం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం లభిస్తుంది. శ్రీవారు, శ్రీమతి గౌరవప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కుంటారు. అధికారులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ, ఏకాగ్రత అవసరం. కొత్త వ్యాపారాల ఆలోచనమాని చేస్తున్న వాటిపై దృష్టి పెట్టండి.  

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

14-10-2018 ఆదివారం దినఫలాలు - ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగానే...