Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13-10-2018 - శనివారం మీ రాశిఫలితాలు - ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు...

Advertiesment
13-10-2018 - శనివారం మీ రాశిఫలితాలు - ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు...
, శనివారం, 13 అక్టోబరు 2018 (09:59 IST)
మేషం: బంధువుల మధ్య అనురాగ వాత్యల్యాలు వెల్లివిరుస్తాయి. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు తోటివారి ద్వారా శుభవార్తలు వింటారు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు బంధువర్గాలతో పట్టింపులు ఎదురవుతాయి.
 
వృషభం: వ్యాపారాభివృద్ధికి బాగా కృషి చేయాల్సి ఉంటుంది. దంపతులకు ఏ విషయంలోను పొత్తుకుదరదు. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్‌‌‌లు పూర్తి అవ్వడం కష్టం. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారులను మెప్పిస్తారు.    
 
మిధునం: నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వలన ఆటుపోట్లు తప్పవు. బంధువుల మధ్య అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలుచేస్తారు. ఉద్యోగులకు పనిభారం అధికమవుతుంది.  
 
కర్కాటకం: నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలలో ఏకాగ్రత ముఖ్యం. ఎదుటివారి తీరును గమనించి వ్యవహరించండి. కుటుంబీకులు మీ మాటకు అంతగా విలువనివ్వరు. మీ కార్యక్రమాలు, వ్యవహారాలు ఆశించినంత చురుకుగా సాగవు. 
 
సింహం: వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ఆస్తి పంపకాలు, భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. బిల్లులు చెల్లిస్తారు. ఫైనాన్స్, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుండి ఒత్తిడి అధికం. విలువైన కానుకలందించి ప్రముఖుల ప్రాపకం సంపాదిస్తారు. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తప్పవు.  
 
కన్య: ఆర్థికలావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు బంధువర్గాల నుండి ఆశ్చర్యకరమైన వార్తలు అందుతాయి. వాహనం, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. మీ రాకను మిత్రులు తప్పుగా అర్థం చేసుకునే ఆస్కారం ఉంది. 
 
తుల: కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగస్తుల శక్తి సామర్ధ్యాలను అధికారులు గుర్తిస్తారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.  
 
వృశ్చికం: సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్ విషయంలో ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాుల చేపడతారు. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తికావు. ప్రింటింగ్ రంగాలవారు తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.  
 
ధనస్సు: కొబ్బరి, పండ్లు, పూల, బేకరి, తినుబండారాలు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. రేషన్ డీలర్లు, నిత్యావసర వస్తు స్టాకిస్టులకు వేధింపులు తప్పవు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలు అయిన వారి నుండి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. 
 
మకరం: వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. మీ వ్యాపకాలు తగ్గించుకుని కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించండి. మీ పాత సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
కుంభం: స్త్రీల వాక్‌చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు. గతంలో మిమ్ములను విమర్శించిన వారే మీ సహాయం అర్ధిస్తారు. దైవ, సేవా, పుణ్యకార్యాలయాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.  
 
మీనం: ఉపాధ్యాయులకు, ఆడిట్, అక్కౌంట్స్ రంగాలవారికి ఒత్తిడి, చికాకులు అధికంగా ఉంటాయి. పారిశ్రామికులు ప్రతి వ్యవహారంలోను ఆచితూచి వ్యవహరించడం మంచిది. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. ఎరువులు, మందులు, సుగంధ ద్రవ్య, ఆల్కహాలు వ్యాపారులకు అభివృద్ధి కానవస్తుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భగవంతుడున్నాడు అని చెప్పడం వల్ల భగవంతుని దర్శించగలవా?