16-01-2019 బుధవారం దినఫలాలు - ఆర్థిక విషయాల్లో పురోగతి...

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (08:43 IST)
మేషం: ఆర్థిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. కొంతమంది మీతో సన్నిహితంగా ఉంటూనే చాటుగా అపకారం తలపెట్టేందుకు యత్నిస్తారు. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. మీ మాటతీరు, పద్ధతులను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
 
వృషభం: పత్రికా సంస్థలలోని వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికం. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. సమాచార లోపం వలన నిరుద్యోగులు ఒక అవకాసం చేజార్చుకుంటారు. స్త్రీలకు వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి.  
 
మిధునం: ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి సాధిస్తారు. ఐరన్, సిమెంట్, కలప వ్యాపారస్తులకు మందకొడిగా ఉండగలదు. ఫైనాన్స్ రంగాలలోని వారికి ఖాతాదారుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. రాజకీయాలలోని వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. ప్రయాణాలు అనుకూలం. 
 
కర్కాటకం: ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసివస్తుంది. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పత్రికా, మీడియా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు.  
 
సింహం: అధికారులతో వీలైనంత క్లుప్లంగా సంభాషించడం క్షేమదాయకం. విదేశీయానం, రుణ యత్నాల్లో ఆటంకాలు, చికాకులు తప్పవు. స్త్రీలు విలువైన వస్తువులు, గృహోపరకరణాలు సమకూర్చుకుంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిద. పాతమిత్రులతో విందు, వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు. 
 
కన్య: సభా సమావేశాలలో పాల్గొనడం వలన ప్రముఖులతో పరిచయాలేర్పడుతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గానీ చేపట్టిన పనులు పూర్తికావు. రుణాల కోసం అన్వేషిస్తారు. మీ యత్నాలకు మీ శ్రీమతి నుండి ప్రోత్సాహం ఉంటుంది. పత్రికా, ప్రైవేటు రంగాల వారికి ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి.  
 
తుల: ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషి సత్ ఫలితాలనిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అకాల భోజనం వలన స్త్రీలకు ఆరోగ్యం మందగిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. 
 
వృశ్చికం: రవాణా రంగాలలోని వారికి చికాకులు తప్పవు. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. దుబారా ఖర్చులు అధికం. మీ లక్ష్యం పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మీ కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. 
 
ధనస్సు: ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కార మార్గం గోచరిస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మిత్ర బృందాల వలన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. 
 
మకరం: సాహిత్య సదస్సులో పాల్గొంటారు. ఇతురుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొనవలసి వస్తుంది. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చాలా అవసరం. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కుంటారు. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడుటమంచిది.    
 
కుంభం: ఆర్థిక పరిస్థితిలో కొంత పురోగతి కనిపిస్తుంది. దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఉపాధ్యాయులు విద్యార్థుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.   
 
మీనం: చేపట్టిన పనులు అర్థాంతరంగా ముగించాల్సొస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఆస్తి వ్యవహరాలలో సోదరులతో పోరు అధికమవుతుంది. ఏ వ్యక్తికీ అతి చనుపు ఇవ్వడం మంచిది కాదు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాను అస్థిరపరిచే రాజకీయాలకు దూరం : పవన్ కళ్యాణ్

భాగ్యనగరంలో ఎబోలా వైరస్ కలకలం.. గాంధీ ఆస్పత్రికి ప్రయాణికుల తరలింపు

బాలికకు మద్యం తాగించి అత్యాచారం.. నిందితుడికి దేహశుద్ధి

వాళ్లు అంత ద్వేషంతో నిండి వున్నారని నాకు తెలీదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఏపీలో రాజ్యసభ సీట్ల పంపకం పూర్తి - టీడీపీకి 3, జనసేనకు 1

అన్నీ చూడండి

లేటెస్ట్

05-06-2026 శుక్రవారం ఫలితాలు- రావలసిన ధనాన్ని చాకచక్యంగా రాబట్టుకోవాలి

హనుమంతుడు అక్కడే వుంటాడు

Vibhuvana Sankashti 2026: విభువన సంకష్టి చతుర్థి.. గరిక, బిల్వ పత్రాలతో పూజిస్తే?

04-06-2026 గురువారం ఫలితాలు- రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి

ఇంటికి ముందు మామిడి చెట్టును పెంచడం మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments