Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11-01-2019 శుక్రవారం దినఫలాలు : స్త్రీలు ఆడంబరాలకు పోవడం వల్ల...

Advertiesment
11-01-2019 శుక్రవారం దినఫలాలు : స్త్రీలు ఆడంబరాలకు పోవడం వల్ల...
, శుక్రవారం, 11 జనవరి 2019 (08:07 IST)
మేషం: ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు అధికారుల నుండి ప్రసంశలు లభిస్తాయి. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. సాంఘిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. హోటల్, తినుబండారాలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
వృషభం: మీ వ్యక్తిగత భావాలను, సమస్యలను బయటకు వ్యక్తం చేయండి. మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. ఉద్యోగస్తులకు పదోన్నతి, ఆర్థికపరమైన ప్రోత్సాహకరమైన వార్తలు వింటారు. కోర్టు పనులు వాయిదా పడడం మంచిదని గమనించండి. 
 
మిధునం: వ్యాపార రంగంలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రేమానుబంధాలు, సంబంధ బాంధవ్యాలు మరింత బలపడుతాయి. స్త్రీలు దైవ, సేవా కార్యక్రమాలలో ఆసక్తి, ఉత్సాహంగా పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభం. కాంట్రాక్టర్లకు అధికారుల నుండి ఒత్తిడి, కార్మికులతో చికాకులు తప్పవు. 
 
కర్కాటకం: దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ప్రైవేటు సంస్థల్లో వారికి అభివృద్ధి కానరాగలదు. ప్రయాణాల్లో సంతృప్తి కానవస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం.  
 
సింహం: విద్యార్థులకు తోటివారి కారణంగా చికాకులను ఎదుర్కుంటారు. స్త్రీలకు ప్రతి విషయంలో ఓర్పు, నేర్పు అవసరమని గమనించండి. గృహంలో నూతన వస్తువులను అమర్చుకోగలుగుతారు. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు పెరిగినా ఆర్థిక సంతృప్తి, ప్రయోజనం పొందుతారు. 
 
కన్య: ఆరోగ్య విషయంలోను ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. పాతమిత్రుల కలయిక, గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. సిమెంటు, కల, ఐరన్, ఇటుక వ్యాపారులకు నిరుత్సాహం తగదు. మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది.  
 
తుల: కాంట్రాక్టర్లకు చేతిలోపని పూర్తి కావడంతో ఒకింత కుదుటపడుతారు. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో అపరిచితులను అతిగి విశ్వసించడం వలన ఆశాభంగానికి గురికాక తప్పదు. నిరుద్యోగుల యత్నాలు కలిసిరాగలవు. 
 
వృశ్చికం: సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. అనుకున్న పనులు కాస్త ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తికాగలవు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రావలసిన బాకీలు సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వ చేయలేరు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. 
 
ధనస్సు: బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. విద్యా, వైద్య సంస్థల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. భార్య, భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. 
 
మకరం: కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు. పట్టువిడుపు ధోరణితో వ్యవహరించడం వలన కొన్ని పనులు మీకు సానుకూలమవుతాయి. సన్నిహితుల మధ్య రహస్యాలు దాచడం వలన విభేదాలు తలెత్తవచ్చును. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది.    
 
కుంభం: వస్త్ర, వెండి, బంగారు లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు చేతిలోపని పూర్తికావడంతో ఒకింత కుదుటపడుతారు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ప్రైవేటు సంస్థలలోని వారు, రిప్రజెంటేవివ్‌లు మార్పులకై చేయు యత్నాలు ఫలిస్తాయి.   
 
మీనం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. స్త్రీలకు విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. రావలసిన ధనం వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మామిడి ఆకుల తోరణాన్ని ఆ రోజుల్లో ఇంటి గుమ్మం ముందు కడితే..?