Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-01-2019 ఆదివారం దినఫలాలు - ప్రేమికుల మధ్య అనుమానాలు...

Advertiesment
06-01-2019 ఆదివారం దినఫలాలు - ప్రేమికుల మధ్య అనుమానాలు...
, ఆదివారం, 6 జనవరి 2019 (09:32 IST)
మేషం: సంఘంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం పొందుతారు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. మీరు ఇతరుల గురించి చేసిన వ్యాఖ్యాలు వివాదాస్పదమవుతాయి. ప్రియతములను కలుసుకుని విలువైన కానుకల్చిపుచ్చుకుంటారు. కుటుంబంలో అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి.
 
వృషభం: వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలుచేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీల ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చేయదల్చుకున్న ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సాగవు. క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి.  
 
మిధునం: పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు ఎంత శ్రమించినా గుర్తింపు ఏమాత్రం ఉండదు. విద్యార్థుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. చేతి వృత్తుల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రేమికుల మధ్య అనుమానాలు అపోహలు తలెత్తుతాయి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి.
 
కర్కాటకం: మత్స్య, కోళ్ల, పాడి పరిశ్రమల వారికి పురోభివృద్ధి. సాహస ప్రయత్నాలు విరమించండి. ప్రింటింగ్ రంగాల వారికి బాకీల వసూలల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. సంతానం భవిష్యత్తుకోసం కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, అభిప్రాయాలు మార్చుకోవలసి ఉంటుంది.   
 
సింహం: కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. రాబడికి మించిన ఖర్చుల వలన ఒడిదుడుకులు తప్పవు. ఇతరుల సహాయం అర్ధించడానికి మొహమ్మాటం అడ్డువస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. స్త్రీలపై ఆత్మీయుల హితోక్కులు బాగా పనిచేస్తాయి.  
 
కన్య: వస్త్ర, ఫ్యాన్సీ, పచారి, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు తోటివారితో వేడుకలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ దర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. మీ కళత్ర వైఖరిలో మార్పు సంతోష పరుస్తుంది. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు.
 
తుల: మీ శ్రీమతిని, పిల్లలను మెప్పించడం కష్టమవుతుంది. ఉన్నతస్థాయి అధికారులకు ఆకస్మిక స్థానచలనం లేదా ప్రయాణం చేయవలసివస్తుంది. కార్యసాధనకు బాగా శ్రమించవలసి ఉంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. అయిన వారే మిమ్ములను అపార్థం చేసుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
వృశ్చికం: ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. భాగస్వామిక చర్చలు, ఉమ్మడి వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు మనస్థిమితం ఉండదు. ప్రతి విషయంలోను ఏమరుపాటుగా ఉంటారు. ధనం ఎంత వ్యయం చేసినా ఫలితం ఉండదు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నష్టాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. 
 
ధనస్సు: వృత్తుల వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. నూతన పరిచయాలేర్పడుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. క్రయవిక్రయాలు ఊపందుకుంటాయి. పారిశ్రామిక రంగాల వారికి ఊహించని ఆటంకాలెదురవుతాయి. ఆప్తుల రాకతో మానసికంగా కుదుటపడుతారు.  
 
మకరం: ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు అమితంగా అభిమానించే వ్యక్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయ వ్యయాల్లో ఏకాగ్రత వహించండి. ప్రముఖులతో లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు సంబంధించిన విషయాలు చర్చిస్తారు. గృహ నిర్మాణాలు, మర్మత్తులు, మందకొడిగా సాగుతాయి.     
 
కుంభం: వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథాకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. విలువైన కానుక ఇచ్చి మీ శ్రీమతిని ప్రసన్నం చేసుకుంటారు. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వలన స్వల్ప ఇబ్బందులు తప్పవు. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది.   
 
మీనం: మీ సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలు కళాత్మక, క్రీడా, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన మంచిది. ప్రైవేట్, ఫైనాన్స్, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుండి ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత అవసరం.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

06-01-2019 నుంచి 12-01-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)