Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

31-12-2018 - సోమవారం మీ రాశి ఫలితాలు - బంధుమిత్రులను విందులకు ఆహ్వానిస్తారు....

Advertiesment
31-12-2018 - సోమవారం మీ రాశి ఫలితాలు  - బంధుమిత్రులను విందులకు ఆహ్వానిస్తారు....
, సోమవారం, 31 డిశెంబరు 2018 (09:40 IST)
మేషం: ఆర్థిక ప్రగతి సాధిస్తారు. ధన లాభంతో పాటు మీ కీర్తిప్రతిష్టలు మరింత పెరిగే ఆస్కారం ఉంది. ప్రతి విషయం ధనంతో ముడిపడి ఉంటుంది. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. ఏ వ్యక్తినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు. ఆత్మీయుల ఆకస్మిక బదిలీ నిరుత్సాహం కలిగిస్తుంది.
 
వృషభం: రవాణా, మెకానికల్, ఆటోమొబైల్ రంగాల వారికి పురోభివృద్ధి. రాజకీయనాయకులు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. స్త్రీల ప్రతిభా, పాఠవారలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత వహించండి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. శుభాకాంక్షలు అందజేస్తారు.  
 
మిధునం: బంధుమిత్రులను విందులకు ఆహ్వానిస్తారు. కొంతమంది సూటీపోటి మాటల వలన మీరు మానసిక ఆందోనలకు గురవుతారు. ధనం మితంగా వ్యయం చేయాలి. ఉద్యోగస్తులు దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. మీ సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం: కొంతమొత్తం చెల్లించి రుణదాతలను సంతృప్తిపరుస్తారు. పారిశ్రామిక వేత్తలకు విద్యుత్ సమస్యలు, కార్మికులతో వివాదాలు తప్పవు. చెక్కులు జాతీ సంతకాల విషయంలో అప్రమత్తత అవసరం. వృత్తి వ్యాపారులు స్వల్ప ఇబ్బందులు తలెతుత్తాయి. విద్యార్థుల్లో నిశ్చింత, ప్రశాంతత చోటు చేసుకుంటుంది.  
 
సింహం: నూతన ప్రదేశాల సందర్శన మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది. బంధుమిత్రలను కలుసుకోగలుగుతారు. టెక్నికల్, కంప్యూటర్ రంగాలలోవారికి లాభదాయకం. అదనపు ఆదాయం కోసం చేసే యత్నాలు ఫలించవు. పుణ్య, దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంపత్య సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. 
 
కన్య: స్త్రీలకు వస్త్ర, ధన గృహ లాభాలు భోజనసౌఖ్యం. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. మిమ్మల్ని ఉద్రేకపరిచి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తారు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. బాకీలు, ఇంటి అద్దెల వసూళ్లలో సంయమనం పాటించండి. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం.   
 
తుల: వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి అనుభవం గడిస్తారు. స్త్రీలకు పనివారితో ఓర్పు, నేర్పు అవసరం. ఉత్తరప్రత్యుత్తరాలు సమర్ధంగా నిర్వహిస్తారు. బంధువులతో చికాకులు తలెత్తుతాయి. మీ ముఖ్యుల ధోరణి మీకెంతో చికాకు కలిగిస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు అవసరం.
 
వృశ్చికం: వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. మీ సంతానం పై చదువుల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఎల్.పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. ఎదుటివారికి సలహాలు ఇచ్చి మీరు సమస్యలు తెచ్చుకుంటారు. 
 
ధనస్సు: కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధనసహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. దైవ దర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది.
 
మకరం: ఆర్థిక లావాదేవాలు వాయిడా పడడం మంచిది. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. విద్యార్ధులకు క్యాంపస్ ఇంటర్వ్యూలలో మంచి ప్రతిభను కనపరుస్తారు. ప్రేమికుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. పత్రికా సంస్థలలోని వారికి కీలకమైన వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.    
 
కుంభం: చిన్న తరహా పరిశ్రమ, కుటీర పరిశ్రమల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధి, గౌరవం పొందుతారు. వాహనం ఇతరలకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత చోటు చేసుకుంటుంది. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం మంచిది కాదని గమనించండి.   
 
మీనం: భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. సైన్స్, గణిత, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానరాగలదు. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. నిరుద్యోగులకు పోటి పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధనుస్సు రాశిలో పుట్టిన వారు ఇలా వుంటారు.. నలుపు రంగుతో..?