Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29-12-2018 - శనివారం మీ రాశి ఫలితాలు.. అందరితో కలుపుగోలుగా...

Advertiesment
29-12-2018 - శనివారం మీ రాశి ఫలితాలు.. అందరితో కలుపుగోలుగా...
, శనివారం, 29 డిశెంబరు 2018 (09:26 IST)
మేషం: అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తూ పనులు చక్కబెట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలలలో శిక్షణ అవకాశం లభిస్తుంది. కోర్టు కేసులకు హాజరవుతారు. స్త్రీలకు టీవీ ఛానెళ్లు, పత్రికా సంస్థల నుండి పారితోషికం అందుతుంది. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు.
 
వృషభం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. సిమెంటు, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. మీ యత్నాలు గుట్టుగా సాగించండి. హోటర్, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. చిన్ననాటి గురువులు, ప్రముఖులను సన్మానిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి.  
 
మిధునం: ఉన్నతాశయాలు, కొత్త పథకాలతో ముందుకు సాగుతారు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఆశించిన మార్పులు వాయిదా పడగలవు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం సంతోషం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారలు నిరుత్సాహపరుస్తాయి. మీ సంతానం రాక కోసం ఎదురుచూస్తారు. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
కర్కాటకం: బంధువులకు వివాహ సమాచారం అందిస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు గుర్తింపు లభిస్తంది. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. స్త్రీలు భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగడం మంచిది.  
 
సింహం: వీసా, పాస్‌పోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి. రవాణా రంగాల్లో వారికి సంతృప్తి కానరాగలదు. క్యాటరింగ్ పనివారలకు, హోటల్, తినుబండారాలు వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. విజ్ఞతతో మీ ఆత్మాభిమానం కాపాడుకుంటారు. అందరూ అయిన వారే అనుకుని మోసపోయే ఆస్కారం ఉంది. 
 
కన్య: కాళ్ళు, నరాలు, నడుముకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లోవారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. విద్యార్థులకు విశ్రాంతి లోపం వలన ఆరోగ్యం మందగిస్తుంది. చిన్ననాటి వ్యక్తుల కలియిక కొత్త అనుభూతినిస్తుంది.  
 
తుల: మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయడం మంచిది. పార్టీలు, వినోద కార్యక్రమాల్లో మితంగా ఉండాలి. ఉద్యోగస్తులకు అధికారుల బదలీ ఉపశమనం కలిగిస్తుంది. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
వృశ్చికం: మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఉపాధ్యాయులు తోటివారి సహకారం వలన గుర్తింపు, లాభం పొందుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. పాత పరిచయస్తులు, ఆప్తులను కలుసుకుంటారు. విదేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలలో జయం చేకూరగలదు.
 
ధనస్సు: విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులలో నాణ్యతాలోపం వలన కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుంది. బంధువుల తీరు ఒకింత కష్టమనిపిస్తుంది. కుటుంబ సమేతంగా ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారస్తులకు లాభదాయకం.  
 
మకరం: సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేయగల్గుతారు. విదేశాల నుండి ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యాపార్లోల అనుభవం, ఆశించిన లాభాలు గడిస్తారు. ధనం ఏమాత్రం నిల్వచేయలేకపోవడం వలన ఆందోళనకు గురవుతారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.    
 
కుంభం: ఆర్థిక సమస్యలు, మానసిక చికాకులకు చక్కని పరిష్కారం లభిస్తుంది, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ పనివారలకు కలిసిరాగలదు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బ్యాంకింగ్ రంగాలవారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. కొత్త పరిచయాలు వ్యాపకాలు ఉత్సాహం కలిగిస్తాయి.     
 
మీనం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. సోదరుల మధ్య సఖ్యత లోపిస్తుంది. నిరుద్యోగుల లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరమని గమనించండి. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. వార్తా సంస్థలలోని సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి.   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింహ రాశి 2019, తొందరపడవద్దు...(Video)