Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30-12-2018 - ఆదివారం.. మీ రాశి ఫలితాలు..

Advertiesment
30-12-2018 - ఆదివారం.. మీ రాశి ఫలితాలు..
, ఆదివారం, 30 డిశెంబరు 2018 (09:52 IST)
మేషం: పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికం. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త వహించండి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. 
 
వృషభం: బంధువుల రాకతో గృహంలో ప్రశాంత లోపం, ఆరోగ్యంలో సమస్యలు వంటి చికాకులను ఎదుర్కుంటారు. రుణ యత్నాల్లో ఆటంకాలు, ధనం సకాలంలో అందకపోవడం వలన మీ ఆర్థిక వ్యవహారులు వాయిదాపడుతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. 
 
మిధునం: దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. సోదరీసోదరుల మధ్య సఖ్యతాలోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. 
 
కర్కాటకం: మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు తమ బంధువర్గాల నుండి సంతోషకరమైన వార్తలు అందుతాయి. ప్రింటింగ్ రంగాలవారికి బాకీలు వసూళ్ళో శ్రమాధిక్యత, ప్రయాసలు వంటివి ఎదుర్కుంటారు.  
 
సింహం: సాహస ప్రయత్నాలు విరమించండి. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. గతంలో వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. ఇతరుల ఆంతరంగిక విషయాలలో తలదూర్చకండి. ఒక స్థిరాస్తి అమర్చుకునే విధంగా మీ ఆలోచనలుంటాయి. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు.  
 
కన్య: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంటకనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. గృహములో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. మీ వ్యక్తిగత విషయాలు బయటికి తెలియజేయకండి. ఆకస్మికంగా మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు.  
 
తుల: మీ శ్రీవారు మీతో ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఆస్థి వ్యవహారాల్లో ముఖ్యులతో విబేధాలు తలెత్తుతాయి. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. రావలసిన ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి.  
 
వృశ్చికం: ఆత్మీయులకు శుభాకాంక్షలు, కానుకలు అందిస్తారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కళా, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 
 
ధనస్సు: దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడుతాయి. స్త్రీలకు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల అసక్తీ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. రాజకీయాల వారికి పార్టీపరంగాను, అన్నివిధాలా గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
మకరం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఎటువంటి స్వార్ధచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. చెప్పుడు మాటలకు ప్రాధన్యమివ్వడం మంచిది కాదని గ్రహించండి.    
 
కుంభం: రవాణా, ఎక్స్‌పోర్ట్ రంగాల్లో వారికి పనివారి వలన ఇబ్బందులకు గురవుతారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సినిమా, సంగీత, నృత్య కళాకారులకు సన్మానాలు వంటివి జరుగుతాయి. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.   
 
మీనం: బంధుమిత్రులకు శుభాకాంక్షలు అందజేస్తారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించుకోవడం ఉత్తమం. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. సంఘంలో మీ మాటపై నమ్మకం గౌరవం పెరుగుతుంది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలను ఎదుర్కుంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30-12-2018 నుంచి 05-01-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)