Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30-12-2018 నుంచి 05-01-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

Advertiesment
30-12-2018 నుంచి 05-01-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)
, శనివారం, 29 డిశెంబరు 2018 (22:24 IST)
కర్కాటకంలో రాహువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో బుధు, గురులు, ధనస్సులో రవి, శని, మకరంలో కేతువు, మకరంలో కేతువు, మీనంలో కుజుడు. కన్య, తుల, వృశ్చిక, ధనస్సులలో చంద్రుడు. 1న ఆంగ్ల సంవత్సరం ప్రారంభం. 4న మాస శివరాత్రి, 1వ తేదీన బుధుడు ధనుర్ ప్రవేశం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. అవకాశాలు చేజారిపోతాయి. దుబారా ఖర్చులు విపరీతం. వేడుకలకు బాగా వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఆది, గురు వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుకాదు. చీటికామాటికి అసహానం ప్రదర్శిస్తారు. ఆలోచనులు నిలకడగా ఉండవు. ఆత్మీయుల కలయికతో కుదుటపడుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. గత సంఘటనలు జ్ఞప్తికొస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు చక్కని ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవహారానుకూలత ఉంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొత్త పరిచయాలేర్పడుతాయి. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. గృహం సందడిగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తికాగలవు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. మంగళ, శని వారాల్లో నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోండి. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి ఆశాజనకం. ప్రయాణంలో చికాకులు తప్పవు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ధనలాభం ఉంది. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. పెట్టుబడులకు అనుకూలం. స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలపడుతుంది. వ్యాపకాలు పెంపొందుతాయి. పరిచయాలు, పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. గురు, శుక్ర వారాల్లో పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. కళాత్మక పోటీల్లో విజయం సాధిస్తారు. ఊహించన సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. జూదాలు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రావలసిన ధనాన్ని సౌమ్యంగా వసూలు చేసుకోవాలి. ఖర్చులు అదుపులో ఉండవు. వినోదాల కోసం బాగా వ్యయం చేస్తారు. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. మీ అభిప్రాయలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆప్తులను వేడుకలకు ఆహ్వానిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు.   
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. వివాహ ఏజెన్సీలను విశ్వసించవద్దు. ప్రముఖులను కలుసుకుంటారు. గృహం సందడిగా ఉంటుంది. ప్రశంసలు, శుభాకాంక్షలు అందుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. బాధ్యతలు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. వేడుకలు, క్రీడా పోటీలకు సన్నాహాలు సాగిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అవివాహితులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. దైవదర్శనంలో అవస్థలు తప్పవు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రముఖులకు కానుకలు అందజేస్తారు. అయిన వారితో ఉల్లాసంగా పాల్గొంటారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. మీ మాటతీరు ఎదుటివారికి కష్టం కలిగిస్తుంది. పెద్దల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ బాధలు తొలగుతాటయి. మానసికంగా కుదుటపడుతారు. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. విదేశాల్లోని ఆప్తుల క్షేమం తెలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. కొనుగోలు దార్లను ఆకట్టుకుంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.    
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఎదుటివారికి చక్కని సలహాలిస్తారు. మీ వాక్కు ఫలిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు మూలక ధనం అందుతుంది. వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలుచేస్తారు. ఆది, సోమ వారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. గత జ్ఞపకాలు అనుభూతినిస్తాయి. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. మీ శ్రీమతి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. స్త్రీల కళాత్మతకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. పందాలు, పోటీలు ఉల్లాసాన్నిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.   
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
కొత్త విషయాలపై దృష్టి పెడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. భేషజాలు, మొహమ్మాటాకు పోవద్దు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. ధనప్రాప్తి ఉంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. మంగళ, బుధ వారాల్లో గుట్టుగా యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. కిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు. వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. క్రీడాపోటీల్లో రాణిస్తారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. రాబడిపై దృష్టి పెడతారు. ధనసహాయం అర్దించేందుకు మనస్కరించదు. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. పట్టుదలతో యత్నాలు సాగించండి. అయిన వారే మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. గురు, శుక్ర వారాల్లో విమర్శలు, వ్యాఖ్యాలు పట్టించుకోవద్దు. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. గృహమార్పు చికాకుపరుస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. జూదాలు, బెట్టింగ్‌ల జోలికి పోవద్దు.  
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. కానుకలు, శుభాకాంక్షలు అందుకుంటారు. వస్త్రాలు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. శనివారం నాడు ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తులు తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వృత్తి ఉపాధఇ పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రముఖులతో పరిచయాలు బలపడుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థికస్థితి సంతృప్తికరం. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. ధనప్రాప్తి ఉంది. ఖర్చులు భారమనిపించవు. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. ఆది, సోమ వారాల్లో పనులు హడావుడిగా ముగిస్తారు. ప్రకటనలు, ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. గృహమార్పు కలిసివస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయుల సలహా పాటించండి. క్రయవిక్రయాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. సంస్థల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి. పందాలు, క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు. ప్రయాణంలో అవస్థత తప్పవు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. దైవదర్శనాలు, వేడుకల్లో పాల్గొంటారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు నిదానంగా పూర్తికాగలవు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు, విశ్రాంతి అవసరం. మంగళ, బుధ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. పంతాలకు పోవద్దు. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సంతానం రాక ఉత్సాహన్నిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. పందాలు, పోటీలు ఉల్లాసాన్నిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీన రాశి 2019... ఆలస్యం అమృతం... (Video)