Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధనస్సు రాశి 2019... ఏలినాటి శని ప్రభావం... (Video)

webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (20:56 IST)
ధనస్సు రాశి : ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా జన్మమము నందు కేతువు, సప్తమము నందు రాహువు, 2020 ఫిబ్రవరి వరకు జన్మమము నందు శని, ఆ తదుపరి ద్వితీయము నందు, నవంబర్ 4వ తేదీ వరకు వ్యయము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా జన్మమము నందు సంచరిస్తారు.
 
ఈ సంవత్సరం ఈ రాశి వారి గోచారం పరిశీలించగా 'కీర్తిః త్యాగాను సారిణీ' అన్నట్లుగా ఇతరుల కోసం ధనం అధికంగా వెచ్చించడం మంచిది కాదని గమనించండి. కుటుంబ విషయాల్లో ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. కుటుంబంలో పరస్పరం వాదులాటలు, అనుమానించుకోవడం, మానసిక అశాంత వంటివి ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంది. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా అనుకూల పరిస్థితి తక్కువగా ఉన్నందున ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించడం, సామరస్యంగా మెలగడం, ప్రతి విషయంలో ఏకాగ్రతగా మెలగడం వంటివి ఈ రాశివారికి చెప్పదగిన సూచన. ఆదాయం తక్కువగా ఉండడం, అలానే ఖర్చులు అధికం కావడం, చిన్న చిన్న ఋణములు దొరకడం వంటివి కాడు కష్టం కావడం, పాత ఋణాల వలన ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితులు గోచరిస్తున్నాయి. 
 
ఈ సంవత్సరం ఈ రాశివారికి గురువు, శని, రాహువులు అనుకూలంగా లేని కారణంగా అన్ని విషయాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొనే ఆస్కారం ఉంది. ఉద్యోగ విషయాల్లో అధిక శ్రమ పొందినప్పటికి గుర్తింపు, గౌరవం వంటివి ఉండవు. అధికారుల నుండి ఇబ్బందులు ఎదురైనప్పటికి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. తోటివారితో సంయమనంగా మెలగడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పెట్టే యత్నాలు విరమించడం మంచిది. అనుకున్న రీతిగా లాభాలు రావనే చెప్పాలి. ఆరోగ్య విషయముల యందు జాగ్రత్త అవసరం. శని రాహువుల ప్రభావం చేత, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కునే ఆస్కారం ఉంది. విద్యార్థులు విద్యావిషయాల పట్ల అధిక కృషి చేసినప్పటికి ఒక మోస్తరు ఫలితాలను మాత్రమే అందుకుంటారు. 
 
స్థిరాస్తి కొనుగోలుకై చేయు యత్నాలు వృధా ప్రయాసగా మిగిలిపోతాయి. సినీ, కళా రంగాల్లో వారికి అధిక శ్రమానంతరం సత్ఫలితాలు ఉంటాయి. రాజకీయాల్లో ఉన్నవారికి ప్రత్యర్థుల నుండి ఆపదలు తలెత్తే ఆస్కారం ఉంది. ఇతరులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. రైతులు విత్తనాల విషయంలో కానీ, నకిలీ వస్తువుల విషయంలో కానీ జాగ్రత్త వహించాలి. ముఖ్యుల మాట, తీరు మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు వెనక్కి, ముందుకు గుంజాటనగా ఉంటాయి. కానీ ఏ మాత్రం పురోగతి కానరాదు. నిరుద్యోగులు అతి కష్టం మీద చిన్న చిన్న ఉద్యోగాలు సంపాదించగలుగుతారు. నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ప్రతి పని శ్రమతో కూడుకుని ఉంటాయి. ప్రయాణ విషయాల్లో జాగ్రత్త అవసరం. శరీరం అలసటకు గురవడం, ఆందోళన, భయం వంటివి ఉండగలవు. బంధువులతో, స్నేహితులతో వ్యవహరించడం, ప్రతి పనిని స్వయంగా చేసుకుని ముందుకు సాగడం, ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా ఉండడం మంచిది. 
 
* ఈ రాశివారికి ఏలినాటి శనిదోషం ఉన్నందువలన ప్రతి శనిత్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించి, 16 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి, తెల్లని పూలతో శనిని పూజించిన శుభం కలుగుతుంది.
* ఈ రాశివారు లలితా సహస్రనామం చదవడం వలన లేక వినడం వలన కుబేరుని ఆరాధించడం వలన సర్వదా జయం చేకూరుతుంది. 
* మూల నక్షత్రం వారు వేగి, పూర్వాషాఢ నక్షత్రం వారు నిమ్మ, ఉత్తరాషాడ నక్షత్రం వారు పనస, ఖాళీ ప్రదేశాల్లో గానీ, దేవాలయాల్లోని గానీ, విద్యాసంస్థల్లో గానీ నాటిన శుభం జయం, పురోభివృద్ధి కలుగుతాయి.
* మూల నక్షత్రం వారు కృష్టవైఢూర్యం, పూర్వాషాడ వారు వజ్రం ఉత్తరాషాడ వారు పుచ్చుకెంపు ధరించిన శుభం కలుగుతుంది. వీడియో చూడండి.. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

వృశ్చిక రాశి 2019- రాహు సంచారం అలా వుంది (Video)