Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వృశ్చిక రాశి 2019- రాహు సంచారం అలా వుంది (Video)

Advertiesment
వృశ్చిక రాశి 2019- రాహు సంచారం అలా వుంది (Video)
, శనివారం, 29 డిశెంబరు 2018 (20:23 IST)
వృశ్చికరాశి: ఈ రాశివారికి నవంబర్ 4వ తేదీ వరకు జన్మమము నందు బృహస్పతి, ఆ తదుపరి ద్వితీయము నందు ఈ సంవత్సరం అంతా ద్వితీయము నందు కేతువు, అష్టమము నందు రాహువు, 2020 ఫిబ్రవరి వరకు ద్వితీయము నందు శని, ఆ తదుపరి అంతా తృతీయము నందు సంచరిస్తారు.
 
ఈ సంవత్సరం మీ గోచారం పరీక్షించగా... అతిలోభం వలన ఎదుటివారి గురించి అధికంగా ఆలోచించడం వలన సమస్యలు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఆర్థిక లావాదేవీలు కుదుటపడే ఆస్కారం ఉంది. ఆదాయం పెంచడానికి అనువైన మార్గాలు అన్వేషిస్తారు. కాని ఆచరణలో తక్కువగా ఉంటుంది. 2020లో ఏలినాటి శనిదోషం పూర్తయినప్పటికి రాహు సంచారం అనుకూలం మీకు తక్కువగా ఉంటుంది. ఖర్చులు నియంత్రించలేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. 
 
సంతానం అభివృద్ధి విషయంగా కూడా తీవ్రంగా ఆలోచిస్తారు. మీకు ఏలినాటి శని ప్రభావంగా కొత్త ఋణముల అవసరం తీరేవరకు మానసిక ఒత్తిడి ఉంటుంది. ఏలినాటి శని అష్టమ రాహువు ఉన్ననూ కేవలం గురుపు యొక్క సహకారం వలన ఇంకా రవి, కుజ, శుక్ర సహకారం కారణంగా చాలావరకు సమస్యలు దాటవేస్తారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక ఇబ్బందులు ఉండవు. కానీ, పాత అనారోగ్యముల విషయంలో సరియగు జాగ్రత్తలు పాటింపక ఇబ్బందులు ఎదుర్కుంటారు. అంతేకాక మానసిక ఆందోళనకు గురవుతారు. ఉద్యోగ విషయాల యందు సరిగ్గా దృష్టి పెట్టలేరు. అధికారుల నుండి ఒత్తిడులు, నష్టపోతామేమో అన్న ఆందోళన మీలో అధికంగా ఉంటుంది. 
 
అధిక శ్రమ పడినప్పటికి ఎటువంటి నష్టము జరగదు. నూతన ఉద్యోగ యత్నాలు చేయువారికి ఎప్పుడు ఏమీ చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. విద్యార్థులు సాధారణ స్థాయి కంటే కొంచెం ఎక్కువ స్థాయిగానే ఫలితాలు అందుకుంటారు. విద్యార్థుల కన్నా విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. స్థిరాస్తులు ఏర్పరచుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. అయితే ఇతరుల చేతిలో మోసపోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. రోజువారి కార్యక్రమాల్లో కూడా అవాంతరాలు ఏర్పడుతాయి. నూతన పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కీలక నిర్ణయాల విషయంలో కుటుంబీకుల సలహా పాటించడం మంచిది. కుటుంబీకుల అన్యోన్యత నెలకొంటుంది. 
 
వృత్తి, ఉద్యోగం, సంఘంలో మీ మాటకు విలువ తగ్గుతుందనే భావల మీలో అధికం అవుతుంది. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ప్రతిఫలితాలు లభిస్తాయి. అవివాహితుల్లో నూతనోత్సాహం నెలకొంటుంది. వైద్య, కళా రంగాల్లో వారికి పురస్కారాలు, గుర్తింపు, గౌరవం పొందుతారు. తీర్థయాత్రల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతనలో గడపడం వలన మానసిక ప్రశాంతత పొందుతారు. విలువైన వస్తువాహనాలు కొనుగోలుచేస్తారు. కోర్టు వ్యవహారాలు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ కాలక్షేపం చేయడం ఉత్తమం, స్పెక్యులేషన్ రంగాల్లో వారికి లాభదాయకం.
 
* 2020 ఫిబ్రవరి వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువలన ప్రతి శనివారం 9 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి, ఎర్రని గులాబీ పూలతో శనిని పూజించిన శనిదోష నివారణ జరుగుతుంది.
* ఈ రాశివారు సదాశివును ఆరాధించి, విభూది ధరించడం వలన సర్వదా శుభం కలుగుతుంది. 
* విశాఖ నక్షత్రం వారు మొగలి మొక్కను, అనూరాధ నక్షత్రం వారు పొగడ మొక్కను, జ్యేష్ట నక్షత్రం వారు కొబ్బరి మొక్కను నాటిన సర్వదోషాలు తొలగిపోతాయి. 
* విశాఖ నక్షత్రం వారికి కనపుష్యరాగం, అనూరాధ వారికి పుష్యనీలం, జ్యేష్టవారికి గరుడపచ్చ ధరించిన శుభం కలుగుతుంది. వీడియో చూడండి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షిర్డి సాయిబాబాను పూజించడం అంటే కొబ్బరికాయలు కొట్టడం కాదు...