Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తులా రాశి 2019, చేయి దాటిపోయిన దాని గురించి... (Video)

Advertiesment
Libra Horoscope 2019
, శనివారం, 29 డిశెంబరు 2018 (18:25 IST)
తులారాశి: ఈ రాశివారికి నవంబర్ 4వ తేదీ వరకు ద్వితీయము నందు బృహస్పతి, ఆ తదుపరి తృతీయము నందు, ఈ సంవత్సరం అంతా తృతీయము నుందు కేతువు, భాగ్యము నందు రాహువు, 2020 ఫిబ్రవరి వరకు తృతీయము నందు శని, ఆ తదుపరి అంతా చతుర్థము నందు సంచరిస్తారు. 
 
ఈ సంవత్సరం మీ గోచారం పరిశీలించగా 'పరహస్తం గతం గతః' అన్నట్లుగా మీ చేయి దాటిన దానిని గురించి ఇక మీరు ఆలోచించకుండా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాల యందు నవంబరు వరకు పరిస్థితి బాగానే ఉంటుంది. అవసరాల నిమిత్తంగా ఇబ్బంది ఆర్థిక విషయంలో రాదు. అలాగే నవంబరు తరువాత కూడా విశేషమైన ఖర్చుల దృష్ట్యా ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉంటుంది. పాత ఋణాలు తీర్చుకునే యత్నాలు చేస్తారు. శని, గురువుల సంచారం అనుకూల ప్రభావం చేత ప్రతి అంశాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. ప్రతి విషయంలో కుటుంబీకులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. 
 
ఉద్యోగ వ్యవహారాల యందు మీ ప్రవర్తన ఇతరులకు అనుకూలంగా ఉండడంతో మంచి గౌరవ ప్రతిష్టలు అందుకోవడం, ఉద్యోగంలో అభివృద్ధి వంటివి కానవస్తాయి. స్థానచలన యత్నాలు అవసరమనుకుంటే ప్రయత్నించిన సఫలీకృతులౌతారు. వృత్తి వ్యాపారాల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించుకుంటూ తెలివితో ముందుకు సాగుతారు. సంతానానికి సంబంధించిన శుభవార్తలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలు చక్కగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో కూడా మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. మంచిమంచి అవకాశాలు పొందే సూచనలున్నాయి. విద్యార్థులకు విద్యా విషయంగా మంచి ఫలితాలు లభించినప్పటికీ కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. 
 
ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. కళ్లు, తల, నరాలు, గుండెకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రశాంత వాతావరణంలో ఉండి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం సర్వవిధాలా శ్రేయోదాయకం. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారు సెటిల్‌మెంట్ పద్ధతి ద్వారా వ్యవహారాలు చక్కబెట్టుకోవడం మంచిది. విదేశీప్రయాణ యత్నాలు చేసేవారు శనిబలం, అనుకూల దృష్టిరీత్యా మంచి ఫలితాలు అందుకుంటారు. రైతులకు వాతావరణం అనుకూలిస్తుంది. వారి శ్రమకు తగ్గట్టుగా ఫలితాన్ని ఈ సంవత్సరం అందుకోబోతున్నారు. 
 
ప్రతి విషయంలో ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. స్థిరాస్తులు అభివృద్ధి చేసుకునే దృష్ట్యా ముందుకు సాగుతారు. నిర్మాణ పనుల్లో ఒత్తిడి నెలకొంటుంది. వైద్య, కళా రంగాల్లో వారి శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. విలువైన వస్తు, ఆభరణాల వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. అవివాహితులకు మంచి సంబంధాలు స్థిరపడే ఆస్కారం ఉంది. పుణ్య, సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. ఈ సంవత్సరాంతంలో మాత్రం వృత్తి ఉద్యోగాల్లో అవకాశం ఉంది. కాబట్టి ప్రతి సమస్యలోనూ పరిష్కారం వెతుక్కుంటూ ముందుకు సాగి సత్ఫలితాలు పొందండి.
 
* ఈ రాశివారు లక్ష్మీగణపతిని, శఆరదాదేవిని పూజించడం వలన సర్వదా మనోసిద్ధి చేకూరుతుంది.
* చిత్తా నక్షత్రం వారు మొగలి చెట్టును దేవాలయాలలోని కానీ విద్యా సంస్థలలో కానీ, ఖాళీ ప్రదేశాలలో నాటిన అభివృద్ధి కానవస్తుంది.
* చిత్త నక్షత్రం వారు జాతి పగడం, స్వాతి నక్షత్రం వారు ఎర్ర గోమేధికం, విశాఖ నక్షత్రం వారు వైక్రాంతిమణి ధరించిన పురోభివృద్ధి పొందుతారు. వీడియోలో చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాసుల కుండను తూర్పు దిశలో ఎవ్వరికీ తెలియకుండా వుంచితే?