కర్కాటక రాశి 2019 ఫలితాలు ఇలా వున్నాయి(Video)

శుక్రవారం, 28 డిశెంబరు 2018 (15:02 IST)
కర్కాటకరాశి: ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా వ్యయము నందు రాహువు, షష్ఠమును నందు కేతువు, నవంబర్ 4వ తేదీ వరకు, పంచమము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా షష్టమము నందు, 2020 ఫిబ్రవరి వరకు షష్ఠమము నందు శని, ఆ తదుపరి అంతా సప్తమము నందు సంచరిస్తారు.
 
మీ గోచారం పరిశీలించగా 'బుద్ధి కర్మాను సారిణి' అన్నట్లుగా చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది అన్నట్లు ఈ సంవత్సరం కుటుంబపరంగా కానీ, పిల్లల యొక్క అభివృద్ధి పరంగా గాని సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. గతం నుండి కూడా ఉన్న కుటుంబ సమస్యలు ఈ సంవత్సరం తీరిపోగలవు. పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాల యందు ఆదాయం అన్ని విధాలుగా సానుకూలంగా అందుతుంది. ఆదాయం వ్యయం రెండూ సానుకూల స్థితిగానే ఉంటారు. ఋణాలు చేసినప్పటికి సమయానికి తీర్చ గలుగుతారు. అయితే సమయాన్ని వృధా చేయకుండా వేగవంతమైన ఆలోచనలు వేసి ముందుకు సాగిన ఈ సంవత్సరం సత్ఫలితాలు అందుకో గలుగుతారు. 
 
ఇతరులకు సహాయం చేసే ధోరణిలో ఉండి, మీరు సమస్యలకు గురికాకండి. ఉద్యోగులకు అధికారులు, తోటివారి నుండి కూడా సహకారం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అధిక కృషి చేసి లాభాలను పొందగలుగుతారు. భాగస్వామ్యులను ఆహ్వానిస్తారు. విద్యార్థులు తమ బుద్ధి కుశలతను, ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్య రీత్యా చిన్న చిన్ సమస్యలు ఎదుర్కుంటారు. స్థిరచరాస్తుల విషయమై ముఖ్యులతో సంప్రదింపులు చేసి వాటికి పరిష్కార మార్గాలను వెతుకుతారు. స్థిరాస్తుల అభివృద్ధికై తపనపడుతారు. ముఖ్యుల సలహాలు మీకెంతే ఉపకరిస్తాయి. కోర్టు వ్యవహారాలు, సెటిల్‌మెంట్ వ్యవహారాలు కూడా మలిదశకు చేరుకుంటాయి. 
 
వాయిదా పడుతున్న పనులు పూర్తి చేసుకోగలుగాతారు. విద్యా సంస్థల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలు పొందడానికి అధిక కృషిచేస్తారు. వైద్యరంగాల్లో వారు పరిశోధనలు చేసి మంచి గుర్తింపు, గౌరవం సంఘంలో పొందుతారు. తీర్థయాత్రులు, ప్రయాణాల్లో మెళకువ అవసరం. దైవదర్శనాల వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యవసాయ రంగాల్లో వారు వాతావరణానికి తగ్గట్టుగా పంటలు వేసి లాభాల బాటలో ముందుకు సాగుతారు. పెస్టిసైడ్స్ ఎక్కువగా వినియోగించడం వలన ఎగుమతుల్లో ఇబ్బందులు ఎదుర్కొనడం జరుగుతుంది. గృహనిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. నిర్మాణ పనుల్లో ఒత్తిడి, చేపట్టిన పనుల్లో జాప్యం ఎదుర్కుంటారు. 
 
కాంట్రాక్టర్లకు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. నూతన వివాహితులు శుభవార్తలు వింటారు. రాజకీయాల్లో వారు ప్రత్యర్థుల వలన ఇబ్బందులు ఎదుర్కుంటారు. విలువైన వస్తువాహనాలను అమర్చుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలకు ఈ సంవత్సరం మంచి అనకూలమైన కాలం. సినీ రంగాల్లో వారికి కళాకారులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశీయాన యత్నాల్లో అధిక ఇబ్బందులు, ఎదుర్కొన్న చివరికి సఫలీకృతులౌతారు. అవివాహితులకు రాహువు ప్రభావంగా మధ్య మధ్య ఆలోచనలు దారి తప్పినా మొత్తం మీకు యితర గ్రహానుకూల ప్రభావం చేతి మంచి ఫలితాలు పొందగలుగుతారు. 
 
* ఈ రాశివారు నవదుర్గదేవిని తెల్లని పూలతో పూజించి, ఆరాధించిన సర్వదా జయం చేకూరుతుంది.
* పునర్వసు నక్షత్రం వారు గన్నేరు, పుష్యమి నక్షత్రం  పిప్పలి, ఆశ్లేష నక్షత్రం వారు బొప్పాయి మొక్కను దేవాలయాల్లో గానీ, విద్యా సంస్థల్లోగానీ, ఖాళీ ప్రదేశాల్లో గానీ, నాటిన శుభం జయం, పురోభివృద్ధి కలుగుతాయి.
* పునర్వసు నక్షత్రం వారు వైక్రాంతమణి, పుష్యమి నక్షత్రం వారు సౌగంధికానీలం, ఆశ్లేష నక్షత్రం వారు గరుడ పచ్చ అనే రాయిని ధరించిన శుభం కలుగుతుంది. వీడియో చూడండి...

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఈ చెట్టును పూజిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?