కన్యా రాశి 2019, మీ సహాయం పొంది మీకే...(Video)

శనివారం, 29 డిశెంబరు 2018 (14:31 IST)
కన్యారాశి: ఈ రాశివారికి నవంబర్ 4వ తేదీ వరకు తృతీయము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా చతుర్థము నందు, ఈ సంవత్సరం అంతా చతుర్థము నందు కేతువు, రాజ్యము నందు రాహువు, 2020 ఫిబ్రవరి వరకు చతుర్థము నందు శని, ఆ తదుపరి అంతా పంచమము నందు సంచరిస్తారు. 
 
ఈ సంవత్సరం మీ గోచారం పరీక్షించగా 'ధర్మో రక్షతి రక్షితః' అన్నట్లుగా ఈ సంవత్సరం అంతా ధర్మమార్గాన్ని అనుసరించడం వల సర్వదా పురోభివృద్ధి కానవస్తుంది. మీ సహాయం పొంది మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్త వహించండి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్పప్పటికి, పరిస్థితుల మీద అవగాహన సాధించి అవసరమైన వాటికి మాత్రమే ఖర్చులు చేసి, అనవసర వాటిని పక్కనబెడతారు. సంతానం భవిష్యత్తు రీత్యా మంచి మంచి పథకాలు రూపొందిస్తారు. కుటుంబ విషయాల్లో చాలా ఆనందకరమైన జీవినం సాగిస్తారు. ఇబ్బందులు అన్నీ తొలగుతాయి. చాలావరకు పాత సమస్యలు ఇబ్బందులు తీరడం, బంధువర్గం బాగా సహకరించడం వంటి మంచి ఫలితాలు అందుకుంటారు. 
 
అర్థాష్టమ శనిదోషం ఉన్నప్పటికినీ ఈ సంవత్సరం అంతా గత సంవత్సరం కంటే సత్ఫలితాలు అందుకుంటారు. కారణం గురు, రాహువులు యితర గ్రహాలు చాలా సందర్భాలలో అనుకూలించడమే. ఉద్యోగ వ్యవహారాల యందు కూడా సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. అధికారుల నుండి గుర్తింపు, గౌరవం పొందుతారు. తోటివారి సహకారం మీకు అందుతుంది. సమయానికి పనులు వాయిదా వేయకుండా పూర్తిచేస్తారు. స్థానచలన యత్నాలు సరిగ్గా చేయకపోతే స్వస్థానంలో నుండి బయటకు అనుకూలం లేని ప్రదేశానికి వెళ్లవలసి వస్తుంది. బాగా ఆలోచించి సత్ఫలితాలతో ముందుకు సాగండి. 
 
విద్యార్థులకు నవంబర్ మాసం నుండి గురువు యొక్క అనుకూల దృష్టి కారణం చేత సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉత్తమ ఫలితాలను అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయం దృష్ట్యా కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉన్నది. వాతమునకు, నరాలకం సంబంధించిన చికాకులు మిమ్మల్ని బాధించే ఆస్కారమున్నది. వైద్య పరీక్షల్లో ముందుకు సాగిన కొంతవరకు మీకు ఉపశమనం కలుగుతుంది. కోర్టు వ్యవహారాలు చికాకు పెట్టడం వలన విసిరిపోతారు. చివరకు సెటిల్‌మెంట్ చేసుకుందామనే నిర్ణయానికి వస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో మంచి మంచి పథకాలు వేసినప్పటికి అవి వెనక్కిపోతాయి. అతికష్టం మీద వాటిని సానుకూలం చేసుకునే యత్నం చేస్తారు. 
 
రైతులకు శ్రమాధిక్యత, సరైన ధరలు అందక నిరుత్సాహానికి లోనవుతారు. నవంబరు తరువాత గురువు కొంచెం బుద్ధి చాంచల్యమను కలుగుజేసే అవకాశం ఉన్నది. నిరుద్యోగులు దూరంగా అయినా స్థిరపడాలనే నిర్ణయానికి వస్తారు. విద్యా, వినోదం, విజ్ఞాన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిర్మాణ పనుల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. విదేశీయాన యత్నాలు చేసే వారికి వీసా పనులు ఆలస్యం కావడం, జారీకాకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కుంటారు. నిర్మాణ పనులు ఏ మాత్రం ముందుకు సాగవు. వైద్య, కళా రంగాల్లో వారికి ఒత్తిడి నెలకొంటుంది. కంప్యూటర్, ఎలక్ట్రానిక్, మీడియా రంగాల్లో వారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి. అవివాహితులకు అనుకున్న సంబంధాలు నిశ్చయం కాగలవు. మొత్తం మీద ఈ రాశివారికి శుభా అశుభ మిశ్రమాల మేళవింపుగా ఉండగలదు.
 
* ఈ రాశివారికి 2020 ఫిబ్రవరి వరకు అర్థాష్టమి శనిదోషం ఉన్నందు వలన ప్రతి శనివారం 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి, పచ్చని పూలతో శనిని పూజించిన సర్వదోషాలు తొలగిపోతాయి.
* ఈ రాశివారు శ్రీమన్నారాయణుని తులిసి దళాలతో పూజించడం వలన సర్వదోషాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
* ఉత్తరా నక్షత్రం వారు స్టార్‌రూబి, హస్తా నక్షత్రం వారు స్పందనముత్యాన్ని, చిత్త నక్షత్రం వారు జాతిపగడాన్ని ధరించిన కలిసిరాగలదు. * ఉత్తరా నక్షత్రం వారు జువ్వి, హస్త నక్షత్రం వారు కుంకుడు, చిత్త నక్షత్రం వారు ఉసిరిక మొక్కను దేవాలయాలలో కానీ విద్యా సంస్థలలో కానీ, ఖాళీ ప్రదేశాలలో నాటిని శుభం కలుగుతుంది. వీడియోలో చూడండి...

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 29-12-2018 - శనివారం మీ రాశి ఫలితాలు.. అందరితో కలుపుగోలుగా...