కాసుల కుండను తూర్పు దిశలో ఎవ్వరికీ తెలియకుండా వుంచితే?

శనివారం, 29 డిశెంబరు 2018 (15:04 IST)
వాస్తు ప్రకారం ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరియాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మీరు నిద్రించేటప్పుడు పడమర దిశలో తలనుంచి నిద్రించాలి. సూర్యోదయానికి ఎదురుదిశలో తల వుంచి నిద్రించడం ద్వారా ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది. ఇంకా సిరిసంపదలకు లోటుండదు.


అయితే ఉత్తరం వైపు తల వుంచి నిద్రించడం కూడదు. ఇలా చేస్తే సోమరితనం తప్పదట. ఇంకా దక్షిణం వైపు కూడా తలను వుంచి నిద్రించకూడదు. పడమర దిశలో మాత్రమే తల వుంచి నిద్రించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇంట్లో వున్న నీటి కుళాయిల నుంచి లీకు కాకుండా వుండేలా చూసుకోవాలి. ఇలా నీరు ఎక్కువ ఖర్చు అయితే లేదా.. నీటి లీకేజీలు అధికంగా వుంటే డబ్బు ఖర్చు తప్పదు. ఆదాయం వుండదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లోని తూర్పు వైపు ఏ ప్రాంతంలోనైనా నాణేలను వేసిన కుండను వుంచండి. ఈ కాసుల కుండను మూతపెట్టకుండా తూర్పు దిశలో వుంచాలి. 
 
ఇలా కాసుల కుండ వుండటం ఎవ్వరికీ తెలియకూడదు. ఇలా చేస్తే ఆదాయం చేకూరుతుంది. ఇక మీ డైనింగ్ హాలులో గుండ్రని ఫ్రేమ్ వేసిన అద్దాన్నితగిలించండి. ఈ గ్లాసులో ఆహార పదార్థాలు ప్రతిబింబించేలా వుంటే.. ఆదాయం పెరుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కన్యా రాశి 2019, మీ సహాయం పొంది మీకే...(Video)