04-02-2018 నుంచి 10-02-2018 వరకు మీ రాశి ఫలితాలు

కర్కాటకంలో రాహువు, తులలో బృహస్పతి, వృశ్చికంలో కుజుడు, ధనస్సులో శని, మకరంలో శుక్ర, బుధ, రవి, కేతువులు. కన్య, తుల, వృశ్చిక, ధనస్సులలో చంద్రుడు. 6న శుక్రుడు కుంభ ప్రవేశం.

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (19:24 IST)
కర్కాటకంలో రాహువు, తులలో బృహస్పతి, వృశ్చికంలో కుజుడు, ధనస్సులో శని, మకరంలో శుక్ర, బుధ, రవి, కేతువులు. కన్య, తుల, వృశ్చిక, ధనస్సులలో చంద్రుడు. 6న శుక్రుడు కుంభ ప్రవేశం. 
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆందోళన తొలగి కుదుటపడతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. శుభకార్యానికి తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు అధికం. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆది, గురువారాల్లో ప్రముఖుల సందర్శనం సాధ్యం కాదు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు పదవీయోగం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు రూపొందించుకుంటారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అందరూ మెచ్చుకునేలా వ్యవహరిస్తారు. ప్రేమానురాగాలు బలపడతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. మంగళ, శనివారాల్లో ప్రకటనలు, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొన్ని అనుకోని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి. అవివాహితుల్లో నిరుత్సాహం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక స్థితి సంతృప్తికరం. రుణ విముక్తులవుతారు. ఊహించిన ఖర్చులే వుంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. గురు, శుక్రవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. గృహ నిర్మాణాలు, మరమ్మతులు పూర్తవుతాయి. ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. సన్మాన, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటుతనం వల్ల నష్టపోయే ఆస్కారం వుంది. ఖర్చులు అధికం. సంతృప్తికరం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శనివారం నాడు పనుల ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. ఆత్మీయుల కలయిక సాధ్యం కాదు. వివాహ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. చిన్న వ్యాపారులకు పురోభివృద్ధి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. సమావేశాలు, విందుల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. క్రీడాకారులు విజయం సాధిస్తారు.
 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఈ వారం కుటుంబీకులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ కష్టం వృధా కాదు. సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. శుభకార్యయత్నం ఫలిస్తుంది. స్థోమతకు మించి హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్థపడతారు. గృహమార్పు కలిసివస్తుంది. అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు. ఆరోగ్యం, సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు బాధ్యతల మార్పు, పనిభారం. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2, 3 పాదాలు
అవకాశాలు కలిసివస్తాయి. ఒక వ్యవహారం లాభిస్తుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతమవుతాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. కోర్టు వ్యవహారాలు వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
వివాహ యత్నాలు ముమ్మరంగా సాగిస్తారు. పనుల ప్రారంభంలో అవాంతరాలెదురవుతాయి. బంధుమిత్రులతో విభేదిస్తారు. అవతలి వారి అభిప్రాయాలకు విలువ నివ్వండి. ఎవరినీ నిందించవద్దు. పరిచయస్తులతో సంప్రదింపులు జరుపుతారు. ఆది, సోమవారాల్లో మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఆలోచనలు ఫలిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం చదువుల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఒత్తిడి అధికం. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ధనలాభం పొందుతారు. అవసరాలు, కోరికలు నెరవేరుతాయి. చక్కని ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు, వాహనం మరమ్మతుకు గురవుతాయి. మంగళ, బుధవారాల్లో కుటుంబీకుల గురించి ఆందోళన చెందుతారు. గృహనిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. వ్యాపారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు అధికం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. యత్నాలు విరమించుకోవద్దు. గురు, శుక్రవారాల్లో ఆర్థికలావాదేవీలు, వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. ఖర్చులు విపరీతం, ధనానికి ఇబ్బంది ఉండదు. బంధుమిత్రులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం క్షేమం కాదు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆహ్వానాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడతుంది. సంతానం చదువులపై శ్రద్ధ అవసరం. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు శుభవార్త వింటారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. వాహనచోదకులకు దూకుడు తగదు.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
కొంత మొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు మందకొడిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంలపై ఆసక్తి ఉండదు. ఆత్మీయుల రాకతో కుదుటపడతారు. శనివారం నాడు ఓర్పుతో వ్యవహరించండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. అనాలోచిత నిర్ణయాలు తగవు. సంతానం చదువులపై శ్రద్ధ అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు అంతగా ఉండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులు యూనియన్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. అకౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా గుర్తుంచుకోవాలి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ఆది, సోమవారాల్లో ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. భాగస్వామిక చర్చలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పదవీయోగం స్థానచలనం. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మొక్కులు తీర్చుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ అధికం. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి 
ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు మూలక ధనం ముందుగానే గ్రహిస్తారు. పనులు వేగవంతం అవుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో ఏకాగ్రత వహించండి. స్థోమతకు మించి హామీలివ్వవద్దు. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. మంగళ, బుధవారాల్లో ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు పూర్తవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 

వీడియో చూడండి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శనివారం రాశిఫలితాలు : మీ గౌరవానికి భంగం....