Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుంభ రాశి 2019... సహకారం, అనుకూలం(Video)

webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (22:09 IST)
కుంభరాశి: ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా పంచమము నందు రాహువు, లాభము నందు కేతుపు, 2020 ఫిబ్రవరి వరకు లాభము నందు శని, ఆ తదుపరి అంతా వ్యయము నందు, నవంబర్ 4వ తేదీ వరకు రాజ్యము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా లభాము నందు సంచరిస్తారు.
 
ఈ రాశివారి గ్రహ సంచారం పరిశీలించగా 'ఆత్మబుద్ధి సుఖంచైవ' అన్నట్లుగా మీకు తోచిన విధంగా చేయడం వలన గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందువలన మీకు అన్నివిధాలా పురోభివృద్ధి కానవస్తుంది. కుటుంబ విషయాల్లో అందరి సహకారం, అనుకూలం మీకు ఉంటుంది. కుటుంబ సభ్యులు అందరూ అన్ని విషయాల్లో ప్రోత్సాహంగా ఉంటారు. బంధుమిత్రుల సహకారం కూడా మీకు పుష్కలంగా ఉండడం వలన మీ సమస్యలు సులువుగా సానుకూలంగానే ఉంటాయి. పాత ఋణాలు తీర్చగలుగుతారు. సంతాన విషయంలో వారి అభివృద్ధి రీత్యా మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ విషయముల యందు జాగ్రత్త అవసరం. 
 
అధికారులు, తోటివారి నుండి శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం పొందుతారు. స్థానచలన యత్నాలు, ప్రమోషన్ వంటి శుభశూచికలున్నాయి. వృత్తి, వ్యాపార విషయాల్లో నూతన పథకాలు వేసి జయం పొందండి. మీరు అనుకున్న ప్రణాళికలు అమలుచేయగలుగుతారు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. ఇతరులు కూడా వ్యాపారాభి వృద్ధికి మీకు మంచి సలహా, సహకారం అందిస్తారు. విద్యార్థులకు గురుబలం, శనిసంచారం అనుకూలంగా ఉన్న కారణంగా ఈ సంవత్సరం సత్ఫలితాలు పొందే ఆస్కారం ఉంది. నిరుద్యోగుల నూతన యత్నాలు సఫలీకృతమవుతాయి. 
 
ఈ సంవత్సరం నవంబరు నుండి కాలం అనుకూలంగా ఉన్న దృష్ట్యా స్థిరాస్తి కొనుగోలు లేదా అభివృద్ధి చేసే ఆలోచనలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలు మొదట్లో కొంత ఇబ్బంది కరంగా ఉన్నప్పటికి చివరికి అనకూల ఫలితాలే పొందగలవు. సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారస్తులు దళారీల నుండి ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఎదుర్కొనవలసి వస్తుంది. రైతులు శ్రమ చేసిన కొద్దీ వారికి తగిన ప్రతిఫలం లభిస్తాయి. శని లాభంలో సంచరిస్తూ ఉండడం వలన మీకు మానసిక ఆరోగ్యం, ధనం, అభివృద్ధి అన్ని చేకూరుతాయి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది. కళా, క్రీడా రంగాల్లో వారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి. 
 
ఈ నవంబరుకు గురువు లాభంలోకి వచ్చిన తరువాత అన్ని విషయాల్లో అనుకూల స్థితి పెరుగుతుంది. విలువైన వస్తువులు అమర్చుకోగలుగుతారు. అన్నిరకాల భయము, ఆందోళనలకు దూరమవుతారు. అన్నింటా విజయం కలుగుతుంది. అవివాహితులకు వివాహాయోగం. తీర్థయాత్రలు, ప్రయాణాలు సాగిస్తారు. 2020 జనవరిలో ఏలినాటి శని ప్రారంభం అవుతున్న దృష్ట్యా ఈ సంవత్సరం ప్రతి అంశంలోనూ ఎక్కువ శ్రమచేసి, కార్యనుకూలం కోసం, సమస్యల పరిష్కార కోసం అధిక శ్రమచేస్తారు. విదేశీయాన యత్నాలు కొంతవరకు సఫలం అవుతా. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి పనిభారం ఒత్తిడి అధికంగా ఉంటుంది.
 
* ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా, లక్ష్మీ గణపతిని తెల్లని పూలతో పూజించడం వలన ఆరోగ్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి గుర్తింపు లభిస్తాయి. 
* ధనిష్ట నక్షత్రం వారు జమ్మి, శతభిషా నక్షత్రం వారు అరటి పూర్వాభాద్ర నక్షత్రం వారు మామిడి మొక్కను దేవాలయాల్లో నాటిన సర్వదా శుభం కలుగుతుంది.
* ధనిష్ట నక్షత్రం వారికి తెల్లపగడం, శతభిషా నక్షత్రం వారిక గోమేధికం, పూర్వాభాద్ర నక్షత్రం వారికి వైక్రాంతమణి లేక పుష్యరాగం ధరించిన శుభం కలుగుతుంది. వీడియో చూడండి...

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

మకర రాశి 2019... మీ మిత్రులతో జాగ్రత్త (Video)