మకర రాశి 2019... మీ మిత్రులతో జాగ్రత్త (Video)

శనివారం, 29 డిశెంబరు 2018 (21:56 IST)
మకరం: ఈ రాశివారికి 2020 ఫిబ్రవరి వరకు వ్యయము నందు శని, ఆ తదుపరి జన్మమము నందు, ఈ సంవత్సరం అంతా షష్టమము నందు రాహువు, వ్యయము నందు కేతువు, నవంబర్ 4వ తేదీ వరకు లాభం నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా వ్యయము నందు సంచరిస్తారు.
 
ఈ సంవత్సరం ఈ రాశివారి 'మిత్ర బుద్ధిః ప్రళయాంతకః' అన్నట్లుగా మీ మిత్రుల వలన ధన నష్టం, మాననష్టం జరిగే అవకాశం ఉన్నందువలన ప్రతి పనిలోనూ, ఆచితూచి వ్యవహరించండి. ఈ రాశి వారికి ఏలినాటి సంచారం బాగుండడంతో కొంత సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా గానీ అనుకూలంగా ఉన్నదనే చెప్పవచ్చు. ఇబ్బందికర వాతావరణం ఎదుర్కునే విధంగా బుద్ధికుశలత ఉపయోగించి బయటపడతారు. ధనస్సులో ప్రవేశించినది మొదలు మీకు ఖర్చులు ఎక్కువ కావడం, ఋణాలు, కొంత చికాకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల్లో అధిక శ్రమ పడవలసి ఉన్నది. అధికారులతో అప్రమత్తత అవసరం. తోటివారి తీరు మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
వృత్తి వ్యాపారాల్లో నవంబరు వరకు లాభదాయకంగా ఉంటుంది. నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. ఎండుమిర్చి, కంది, మినుము పంటలు బాగా పండుతాయి. అనారోగ్య సమస్యలకు మంచి తరుణోపాయం దొరుకుతుంది. కళ్ళు, తల, నరాలకు సంబంధించిన సమస్యల నుండి కొంతబయటపడతారు. ఆరోగ్య విషయంలో కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విదేశీయాన యత్నాలు ఫలించగలవు. స్థిరాస్తుల అభివృద్ధి, కొనుగోలు యత్నాలలో మీరుచేసే యత్నాలి ఫలితాయి. పాత సమస్యలు ఒక కొలిక్కిరాగలవు. మానసిక ఒత్తిడి, పనుల మీద దృష్టి అధికంగా ఉంటుంది. కోర్టు వ్యవాహరాల్లో ఉన్నవారికి చక్కని ప్రణాళికలు, సలహాలు, సహకారం అందుతాయి. శనివ్యయంలో సంచారం చేయునపుడు ప్రతి పనిలో ఒత్తిడి, అలసట, గౌరవభంగం వంటివి ఎదుర్కునే ఆస్కారం ఉంది. 
 
కొన్ని సమయాల్లో అనుకోని లాభాలు పొందే ఆస్కారం ఉంది. ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులు పూర్తిచేస్తారు. ముఖ్యుల సహకారం మీకు అందుతుంది. అధికంగా ఆలోచించి ఇబ్బందులకు గురికాకండి. పుణ్యకార్యాలు విరివిగా చేస్తారు. అవివాహితులకు శుభదాయకం. తాము ఇష్టపడిన సంబంధాలు అయ్యే ఆస్కారం ఉంది. కంప్యూటర్, ఎలక్ట్రానికి రంగాల్లోవారికి కలిగిరాగలదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లోవారికి పనిభారం అధికమవుతుంది. పనివారి వలన ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ప్రయాణాలు, తీర్థయాత్రల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఆధ్యాత్మిక చింతనలో గడపడం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యవసాయ దారులు అనుకున్న పంటలు వేసినప్పటికి తగిన గిట్టుబాడు ధరలు అందక కొంత నిరుత్సాహం చెందుతారు. ఎగుమతి, దిగుమతుల్లో కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. స్పెక్యులేషన్ కలిసిరాగలదు.
 
* వర్తమానం ఏలినాటి శనిదోషం ఉన్నందువలన ప్రతి శనివారం 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి, నీలపు శంకు పూలతో శనిని పూజించిన ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి చేకూరుతుంది.
* ఈ రాశివారు వేంకటేశ్వరస్వామిని తెల్లని పూలతో గానీ, పున్నాగ పూలతో గానీ పూజించిన ఆటంకాలు తొలగిపోతాయి. 
* ఉత్తరాషాడ నక్షత్రం వారు పనస చెట్టును, శ్రవణా నక్షత్రం వారు జిల్లేడు చెట్టును, ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును నాటిన సర్వదోషాలు తొలగిపోతాయి.
* ఉత్తరాషాడ నక్షత్రం వారు జాతికెంపు, శ్రవణా నక్షత్ర వారు స్పందన ముత్యం, ధనిష్ట నక్షత్రం వారు తెల్లపగడం ధరించిన సర్వదా పురోభివృద్ధి కానవస్తుంది. వీడియో చూడండి..

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ధనస్సు రాశి 2019... ఏలినాటి శని ప్రభావం... (Video)