Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2018లో మకర రాశి వారి ఫలితాలు ఇలా వున్నాయి...

మకర రాశి: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు (భో, జా, జి) శ్రవణము 1, 2, 3, 4 పాదములు (జూ, జె, జో, ఖ) ధనిష్ట 1, 2 పాదములు (గా, గి), ఆదాయం-8, వ్యయం-14, పూజ్యత-4, అవమానం-5 ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా జన్మము నందు కేతువు, సప్తమము నందు రాహువు, ఈ సంవత్సరం అంతా ఏలి

2018లో మకర రాశి వారి ఫలితాలు ఇలా వున్నాయి...
, శుక్రవారం, 29 డిశెంబరు 2017 (22:01 IST)
మకర రాశి: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు (భో, జా, జి) శ్రవణము 1, 2, 3, 4 పాదములు (జూ, జె, జో, ఖ) ధనిష్ట 1, 2 పాదములు (గా, గి), ఆదాయం-8, వ్యయం-14, పూజ్యత-4, అవమానం-5
 
ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా జన్మము నందు కేతువు, సప్తమము నందు రాహువు, ఈ సంవత్సరం అంతా ఏలినాటి శని, ఈ సంవత్సరం అక్టోబరు 11వ తేదీ వరకు రాజ్యము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా లాభము నందు సంచరిస్తారు. 
 
మీ గోచారం పరిశీలించగా, "కృషి మూల మిదం ధనం" అన్నట్లుగా ఈ సంవత్సరం మీరు ఎంత కృషి చేస్తే అంత ఫలితాలు పొందుతారు. ఏలినాటి శని ప్రథమ భాగము మరియు రాహు ప్రతికూల సంచారం గురు అనుకూల సంచారం దృష్ట్యా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. శని, కుజ, రాహు సంచారం ద్వారా కష్టనష్టాలు ఎదురవుతున్నప్పటికీ కేవలం గురుబలం ద్వారా బుద్ధి వికాసం దైవబలం సహకారంతో సమస్యలు దాటగలుగుతారు. కుటుంబీకుల మధ్య సహాకారం పెరుగుతుంది. ప్రతి సమస్యా సామరస్యంగా ఎదుర్కొంటారు.
 
ఏలినాటి శని ప్రథమ భాగంలో ఉన్నందువల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు, మానసిక అశాంతి, ఆహారం పట్ల విముఖత, అధికశ్రమ వంటివి ఎదుర్కొంటారు. అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ అర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. అన్ని వ్యవహారాల్లో ఇతరులను నమ్మటం మంచిది కాదు. ప్రతి విషయము గోప్యంగా ఉంచడం మంచిది. ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. రాజకీయాల్లో వారు తమ పరపతిని, అనుభవాన్ని ఉపయోగించి తమ పనులు నెరవేర్చుకుంటారు. 
 
శుభకార్య, పుణ్యకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రతి పనిని స్వయంగా చూసుకోవడం మంచిది. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతారు. తరుచుగా ఆరోగ్యంలో ఇబ్బందులు, కుటుంబీకులతో కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త అవసరం. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సంతానం నుండి మీరు ఆశించిన రీతిలో ఫలితాలు ఉండవు. ఆదాయానికి, ఖర్చులకు పొంతన లేకుండా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులతో, తోటివారితో సంయమనం పాటించడం ఉత్తమం. వృత్తి వ్యాపారులకు ప్రతి పనిలోనూ అధిక ఒత్తిడి, కార్యవిలంబం రెండూ ఇబ్బందికి గురిచేస్తాయి. 
 
కోర్టు వ్యవహారాల్లో తెలివితో వ్యవహరించవలసి ఉంటుంది. ప్రింటింగ్ స్టేషనరీ రంగాల్లో వారికి శ్రమాధిక్యత, ఒత్తిడి తప్పదు. రైతులు భాలబాటలో నడుస్తారు. కానీ మోసపూరిత వాతావరణం చుట్టూ ఉన్నదన్న విషయాన్ని గమనించి ముందుకు సాగిన మంచిది. వైద్య రంగాల్లో వారికి విశేష ఆదరణ గుర్తింపు లభిస్తుంది. షేర్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అంతా లాభాల బాటలో ముందుకు సాగుతారు. 
 
అయితే వీరి ఆలోచన తీరు తరచుగా మారుతూ ఉంటుంది. ఆడిట్, అకౌంట్స్ రంగాల్లో వారికి పనివారితో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు అధిక ఒత్తిడికి లోనవుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం కానరాకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. నిరుద్యోగులు ఉద్యోగ యత్నాల్లో విజయం సాధిస్తారని చెప్పొవచ్చు. మొత్తంమీద ఈ సంవత్సరం అంతా ఈ రాశివారు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. ఈ రాశివారు లలితా సహస్రనామం పఠించడం వల్ల మనోసిద్ధి చేకూరుతుంది. 
 
2025 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల 3 నెలలకు ఒక శనివారం నాడు ఉత్తరాషాఢ నక్షత్రం వారు 9 సార్లు, శ్రవణా నక్షత్రం వారు 10 సార్లూ, ధనిష్ట నక్షత్రం వారు 9 సార్లు నవగ్రహ ప్రదిక్షణ చేసి నీలపు శంకుపూలతో శనిని పూజించిన మీ సమస్యలు ఒక కొలిక్కిరాగలవు. 
 
మూల నక్షత్రం వారు వేగి చెట్టును, పూర్వాషాఢ నక్షత్రం వారు నిమ్మ, ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టును ఖాళీ ప్రదేశాల్లోగానీ, దేవాలయాల్లో గానీ, విద్యా సంస్థల్లోగాని నాటిన శుభం కలుగుతుంది. 
 
ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టును, శ్రవణా నక్షత్రం వారు జిల్లేడు చెట్టును, ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును నాటిన సర్వదోషాలు తొలగిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రముఖుల సేవలో తరించిన టిటిడి.. సామాన్య ప్రజలు గాలికి...