Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-01-2019 శనివారం దినఫలాలు - స్త్రీలు పనివారలతో చికాకులు...

Advertiesment
05-01-2019 శనివారం దినఫలాలు - స్త్రీలు పనివారలతో చికాకులు...
, శనివారం, 5 జనవరి 2019 (08:30 IST)
మేషం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. స్త్రీలు పనివారలతో చికాకులను ఎదుర్కుంటారు. విద్యార్థులకు అధిక శ్రమ వలన ఆరోగ్యంలో చికాకులు తప్పవు. ఉద్యోగులు పదోన్నతి, స్థానమార్పిడి యత్నాలలో సఫలీకృతులవుతారు. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారులకు కలిసిరాగలదు.
 
వృషభం: పీచు, ఫోం, లెదర్ వ్యాపారులకు కలిసిరాగలదు. హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ప్రముఖులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. కాంట్రాక్టర్లు ఒకే సమయంలో అనేక పనులు చేపట్టడం వలన విమర్శలు, త్రిప్పట అధికమవుతాయి.  
 
మిధునం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలిసివచ్చే కాలం. పండ్లు, పూల, కొబ్బరి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఊహించని ఖర్చులు, ఇతరత్రా చెల్లింపుల వలన చికాకులు తప్పవు. ఉపాధ్యాయులకు అధిక శ్రమ, ఒత్తిడి ఎదుర్కోక తప్పదు.
 
కర్కాటకం: రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరమని గమనించండి. ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. క్రీడా, కళా, రచన, పత్రికా రంగాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం తప్పదు. బిల్లులు చెల్లిస్తారు.  
 
సింహం: దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులకు నూతన ఆలోచనులు స్పురిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. చేపట్టిన పనుల్లో కొంత ముందు వెనుకలు గానైనను సంతృప్తి కానరాగలదు. 
 
కన్య: సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. రుణం కొంత మొత్తం తీర్చడంతో ఒత్తిడి నుండి కుదుటపడుతారు. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. పుణ్య కార్యాలలో చురుకుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం.  
 
తుల: కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందడంతో నిర్మాణ పనులు చురుకుగా సాగుతాయి. ప్రేమికుల మధ్య అపోహలు తొలగిపోగలవు. కోళ్ళ, మత్య, పాడి పరిశ్రమ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. బంధుమిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. 
 
వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ధాన్యం, కలపం, పేపరు, యాంత్రిక వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సోదరీసోదరుల మధ్య ప్రేమానుబంధాలు బలపడుతాయి. ధనం విరివిగా వ్యయం అయినా సార్థకత ప్రయోజనం ఉంటాయి. తోటివారితో స్నేహ భావంతో సంచరిస్తారు. 
 
ధనస్సు: వాతావరణంలో మార్పు వలన ఆరోగ్యం మందగిస్తుంది. స్థిరాస్తిని అమర్చుకుంటారు. చేపట్టిన పనులు కొంత ముందు వెనుకలుగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, పనిభారం తప్పవు. పెద్దల జోక్యంతో అనుకోకుండా ఒక సమస్య సానుకూలమవుతుంది.
 
మకరం: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ వహించండి. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు అన్ని విధాలా కలిసివస్తుంది.    
 
కుంభం: రాజకీయాల్లో వారికి విరోధులు చేసే ప్రయత్నాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. నూత వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, భాగస్వామిక చర్చలలో మీ ప్రతిపాదనలకు గుర్తింపు, ఆమోదం లభిస్తుంది. అందరితో కలిగి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.   
 
మీనం: వస్త్ర, ఫ్యాన్యీ వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టడం మంచిది. ఫైనాన్స్, చిట్‌ఫండ్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడడం మంచిద. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తగలవు. స్త్రీల సహకారంతో మ దీర్ఘకాలిక సమస్య ఒక కొలిక్కి రాగలదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేస్తే..?