Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

15-01-2019 మంగళవారం దినఫలాలు - రుణయత్నాలు ఫలిస్తాయి...

15-01-2019 మంగళవారం దినఫలాలు  - రుణయత్నాలు ఫలిస్తాయి...
, మంగళవారం, 15 జనవరి 2019 (10:06 IST)
మేషం: భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
వృషభం: స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. ప్రముఖులను కలుసుకుంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ యత్నం ఫలిస్తుంది. ఆత్మీయుల నుండి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు. దైవ దర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కుంటారు. 
 
మిధునం: ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. విద్యార్థులకు మిత్ర బృందాల వలన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కుటుంబ సమస్యల, చికాకులు క్రమంగా సర్దుకుంటాయి. మీరు అభిమానించే వ్యక్తులను కలుసుకుంటారు. 
 
కర్కాటకం: యాదృచ్ఛికంగా దుబారా ఖర్చులుంటాయి. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. స్త్రీలకు బంధువర్గాలతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టునపుడు మెళకువ వహించండి.  
 
సింహం: రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. గృహంలో మార్పులు, చేర్పు వాయిదాపడుతాయి. ఏ విషయాన్ని తేలికగా కొట్టివేయడం మంచిది కాదు. మీ గౌరల ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. 
 
కన్య: వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి, లాభాలు గడిస్తారు. ప్రముఖులతో పరిచాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. ఆకస్మికంగా దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.  
 
తుల: వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి మరింతగ శ్రమించవలసి ఉంటుంది. కానివేళతో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. దీర్ఘకాలిక రుణాలు తీరు ఊరట కలిగిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు, వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. 
 
వృశ్చికం: స్త్రీలకు విదేశీ వస్తువులపై మక్కువ పెరుగుతుంది. ప్రయాణాలలోనూ, బ్యాంక్ వ్యవహారాలలోను ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఏ వ్యక్తినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు. సాహస ప్రయత్నాలు విరమించండి. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కుంటారు. మీ ఉత్సాహన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
ధనస్సు: ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యాల ప్రభావం అధికం. ఖర్చులు అధికమవుతాయి. పాతమిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి.  
 
మకరం: కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఒకేసారి అనేక పనులు మీదపడడంతో ఒకింత అసహానానికి లోనవుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి సహాయం లేనిదే మీ సమస్యలు పరిష్కారం కావని గ్రహించండి. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలుచేస్తారు.    
 
కుంభం: వృత్తి వ్యాపారాల్లో సానుకూల ఫలితాలుంటాయి. స్త్రీలు పట్టింపులకు పోకుండా సర్దుకుపోవడం మంచిది. కుటుంబీకుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. మీ బాధ్యతలు, ముఖ్యమైన పనులు ఇతరులకు అప్పగించి ఇబ్బందులకు గురవుతారు.   
 
మీనం: ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. వృత్తుల వారు ఆదాయం కంటె వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. స్త్రీలు అపరిచితులతో మితంగా సంభాషించండి. ముఖ్యమైన వ్యవహారాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతి రోజున పితృదేవతల పూజ.. గుమ్మడికాయ దానం..?