Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంక్రాంతి రోజున పితృదేవతల పూజ.. గుమ్మడికాయ దానం..?

Advertiesment
సంక్రాంతి రోజున పితృదేవతల పూజ.. గుమ్మడికాయ దానం..?
, సోమవారం, 14 జనవరి 2019 (18:08 IST)
సంక్రాంతి రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం మరిచిపోకూడదు. పితృ సంతృప్తి కోసం కొత్త బట్టలు సమర్పించడం.. బెల్లం, గుమ్మడి కాయలు దానమివ్వడం చేయాలి. సంక్రాంతి రోజు ఇంటి ముంగిట రంగవల్లికలు మెరిసిపోవాలి. రథం ముగ్గు వేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి.


దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే వేళ, పుష్య మాసాన సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే తరుణంలో వచ్చే పండుగ ''సంక్రాంతి'' అంటారు. ఇది మూడు రోజుల పండుగ. 
 
సంక్రాంతి రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని విశ్వాసం. ఈ రోజు నువ్వులను తమ ఆరాధ్య దేవతలకు నైవేద్యంగా పెడితే, శుభం కలుగుతుందనే నమ్మకం వుంది. సంక్రాంతి సందర్భంగా పలువురు మహిళలు నోములు కూడా నోచుకుంటారు. బొమ్మల నోము, గొబ్బి గౌరీవ్రతం, గోదాదేవి నోములు నోయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సాధారణంగా 12 రాశుల్లో సూర్యుడు నెలకొక రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే.. ఆ రాశిని సంక్రాంతిగా పరిగణిస్తారు. 
 
ఆ విధంగా సంవత్సరానికి 12 సంక్రాంతులు ఉంటాయి. కానీ సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు దానిని ''మకర సంక్రాంతి''అంటారు. ఈ మకర సంక్రాంతి రోజున సూర్యదేవునిని పూజించే వారికి సకల శుభాలు చేకూరుతాయి. అలాగే భోగి, సంక్రాంతికి తర్వాత మూడో రోజు కనుమ పండుగను పశువుల పండుగగా జరుపుకుంటారు. పశువులను శుభ్రం చేసి.. పసుపు కుంకుమలతో, పువ్వులతో అలంకరిస్తారు. పశువులను పూజిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతికి ఎందుకు అంత విశిష్టత... (Video)