13-01-2019 ఆదివారం దినఫలాలు - ఆశాజనకమైన మార్పులు...

ఆదివారం, 13 జనవరి 2019 (09:34 IST)
మేషం: ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీలు భేషజాలకు, మొహమ్మాటలకు పోవడం మంచిది కాదు.
 
వృషభం: రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. చేపట్టిన పనులు హడావుడిగా ముగిస్తారు. ఒక సందర్భంలో మిత్రుల తీరు మీకు మనస్తాపం కలిగిస్తుంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితిలో ఆశాజనకమైన మార్పులు సంభవిస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు, ఆలోచనలు స్పురిస్తాయి.  
 
మిధునం: ఫైనాన్స్ వ్యాపారస్థులకు ఖాతాదారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. ఆప్తుల నుండి కొత్త విషయాలు గ్రహిస్తారు. ఖర్చుల విషయంలో ఏకాగ్రత అవసరం. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో పునరాలోచన అవసరం. విద్యార్థులకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
కర్కాటకం: పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. మీ నిర్లక్ష్యం వలన విలువైన వస్తువులు పోగుట్టుకునే అవకాశం ఉంది. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.  
 
సింహం: ఆర్థిక కార్యకలాపాలు సానుకూలంగా సాగుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఆలస్యంగానైనా అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కుంటారు. 
 
కన్య: భార్య, భర్తల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. మిత్రులతో సంప్రదింపులు మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, వ్యాపకాలు అధికమవుతాయి. సహోద్యోగులతో కలిగి విందు, వినోదాలలో పాల్గొంటారు. కోల్పోయిన అవకాశం, వస్తువులు చేజిక్కించుకుంటారు.   
 
తుల: స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. బంధువుల కోసం మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. విలువైన కానుకలు అందించి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటారు. విద్యార్థులు క్రీడలు, క్విజ్ వంటి పోటీలలో రాణిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం: మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. సహోద్యోగులతో అభిప్రాయ బేధాలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రముఖులను కలుసుకుంటారు. ఋణవిముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడుతారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 
 
ధనస్సు: చిన్ననాటి స్నేహితుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కుటుంబ విషయాలలో కూడ మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. నిరుద్యోగులకు లభించిన అవకాశం తాత్కాలికమే అయినా సద్వినియోగం చేసుకోవడం మంచిది.
 
మకరం: ఆర్థిక కార్యక్రమాలు అనుకూలంగా నడుచును. స్త్రీలకు షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. మీ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి స్నేహితులు మీకు కొత్తగా పరిచయం అవుతారు. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ప్రయాణాలలో మెళకువ అవసరం.    
 
కుంభం: వ్యాపార అభివృద్ధికి చేసే కృషి ఫలిస్తుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పులు గమనిస్తారు. ఎదుటివారు మీ సమర్థతను గుర్తిస్తారు. పెద్దలతో కుటుంబ విషయాలు చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్యంలో అధిక జాగ్రత్త అవసరం. పాత బాకీలు వసూలు చేయడం వలన ఆర్థిక ఇబ్బంది తొలగుతుంది.   
 
మీనం: ఉమ్మడి ఆర్థిక లావాదేవీలలో మాట పడవలసి వస్తుంది. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 13-01-2019 నుంచి 19-01-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)