Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం (14-05-2018) దినఫలాలు - గుర్తింపు - గౌరవం లభిస్తాయి..

మేషం: ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. నూతన వ్యాపారాలు, గృహంలో సందడి కానవస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూకోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆల

Webdunia
సోమవారం, 14 మే 2018 (08:48 IST)
మేషం: ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. నూతన వ్యాపారాలు, గృహంలో సందడి కానవస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూకోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. 
 
వృషభం: బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. కొబ్బరి, పండ్ల పూల, చల్లని పానీయ చిరు వ్యాపారులకు అన్ని విధాల కలిసిరాగలదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. సినిమా, కళారంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం అందక ఇబ్బందులెదుర్కుంటారు. 
 
మిథునం: ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికం. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విద్యుత్, ఎ.సి, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తికరంగా ఉంటుంది. కళత్ర మెుండివైఖరి వల్ల కుటుంబంలో కలహాలు, చికాకులు అధికమవుతాయి. 
 
కర్కాటకం: ఉద్యోగ బాధ్యతల్లో చిన్న చిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి. బంధువుల రాక వల్ల పనులు వాయిదా పడతాయి. సోదరులతో వివాదాలు నెలకొంటాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. 
 
సింహం: గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించండి. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలలో దాగియున్న రచనా పటిమకు, కళాత్మతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. విదేశాలకు వెళ్ళటానికి చేయు యత్నాలు వాయిదాపడతాయి.    
 
కన్య: ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం. స్త్రీలు ఆడంబరాలకు ధనం బాగా ఖర్చు చేస్తారు. విదేశీయానం నిమిత్తం చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. 
 
తుల: బ్యాంకు వ్యవహారాలకు సంబంధించిన పనులు చురుకుగా సాగుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వైద్య శిబిరంలోని వారు తరచుగా ఒత్తిళ్లకు గురవుతారు. తలచిన పనులలో కొంత అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
వృశ్చికం: ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. రుణం ఏకొంతైనా తీర్చాలన్న మీ యత్నం ఫలించకపోవచ్చు. రాజకీయ, కళా రంగాల్లో వారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. తోటల రంగాల వారి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.
 
ధనస్సు: తీర్థయాత్రలు, కొత్త ప్రదేశ సందర్శనాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. పారిశ్రామిక వేత్తలకు విద్యుత్ సమస్యలు, కార్మికులతో వివాదాలు తప్పవు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. వాహన చోదకులకు అత్యుత్సాహం అనర్థాలకు దారి తీస్తుంది. పాతమిత్రుల కలయిక, దైవ కార్యాలు మానసిక ప్రశాంతతనిస్తాయి.
 
మకరం: ఒక వ్యవహారంలో మీ అంచనాలు ఊహలు నిజమయ్యే ఆస్కారం ఉంది. మార్కెటింగ్, ప్రైవేటు సంస్ధలలోని వారు అధిక శ్రమ, ఒత్తిడికి గురవుతారు. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో పరస్పర అవగాహన కుదరదు.  
 
కుంభం: మితిమీరిన శరీర శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ లక్ష్యసాధనకు కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి. మీ బంధువులకు సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. లీజు, ఏజెన్సీలు, టెండర్ల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
 
మీనం: మీ అభిప్రాయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. స్త్రీలకు, శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల నుంచి విబేధాలు తలెత్తుతాయి. ఏదైనా అమ్మటానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడుట మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచార బాధితులకు ఎక్కడైనా వైద్యం చేయాలి : ఢిల్లీ హైకోర్టు

Pawan Kalyan: పవన్ 100 పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. శ్రీకృష్ణుడి స్థానంలో పుట్టాడు.. మహిళా ఫ్యాన్ (video)

వైకాపా విధ్వంసానికి పరిష్కారం లభించడం లేదు : సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఎలా సాగిందంటే? (video)

Shawls Turned Dresses: దుస్తులుగా మారిన శాలువాలు.. ఎమ్మెల్యే చింతమనేని అదుర్స్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments