Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13-05-2018 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. మీ కోపాన్ని, చిరాకును?

మేషం: ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. ఆత్మీయులతో కలసి విహార యాత్రలలో పాల్గ

Advertiesment
Daily Horoscope
, ఆదివారం, 13 మే 2018 (10:25 IST)
మేషం: ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. ఆత్మీయులతో కలసి విహార యాత్రలలో పాల్గొంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
వృషభం: హోటల్, స్టాక్ మార్కెట్ లాభాల దిశగా సాగుతుంది. రవాణా రంగాల వారికి మెళకువ అవసరం. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. పాత రుణాలు తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు.
 
మిథునం: ఆర్థిక వ్యవహారాలలో ఒక అడుగు ముందుకేస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. బంధువుల రాకతో ధనం అధికంగా వెచ్చిస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. 
 
కర్కాటకం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కొంతమంది మీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. గత కొంత కాలంగా అనుభవిస్తున్న చికాకులు తొలగిపోతాయి. సోదరుల మధ్య సఖ్యత అంతగా ఉండదు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి.
 
సింహం: విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం అనుకూలించదు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం కూడదు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. విలాసాలకు, ఆడంబరాలకు బాగా వ్యయం చేస్తారు. పత్రికా రంగాల వారికి చికాకులు తప్పవు.   
 
కన్య: చిన్నతరహా, చేతివృత్తుల వారికి కలిసిరాగలదు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఏ.సి. రంగాల్లో వారికి పురోభివృద్ధి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. గృహణీలకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. దైవ, సేవా కార్యాల్లో మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది.
 
తుల: వార్తా సంస్థలలోని వారికి మందకొడిగా ఉంటుంది. టెక్నికల్, కంప్యూటర్ రంగాలలోని వారికి సత్కాలం. బంధు మిత్రులకు మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయనాయకులు సభ సమావేశాలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఉత్తర, ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. 
 
వృశ్చికం: బంధువుల ఆకస్మిక రాక వల్ల మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేయాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఎలక్ట్రానిక్, ఎ.సి. రంగాల్లో వారికి కలిసి రాగలదు. ప్రముఖులతో సాన్నిత్యం పెంచుకుంటారు. స్త్రీలు దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
ధనస్సు: ఆర్ధిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు. స్త్రీలతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఖర్చులు అదుపు కాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ అతిథి మర్యాదలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు.
 
మకరం: ఆర్థిక ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. మిత్రుల సహకారం వల్ల టి.వి. రేడియో రంగాల వారికి అనుకూలం. స్త్రీలు షాపింగ్‌లకు ధనం బాగా ఖర్చుచేస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. నిరుద్యోగులకు ఉపాథి పథకాలపై ఆసక్తి నెలకొంటుంది. 
 
కుంభం: సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలు ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.
 
మీనం: పారిశ్రామిక రంగాల వారికి లైసెన్సులు, పర్మిట్లు సానుకూలమవుతాయి. స్తీలకు బంధువుల నుంచి మెుహమ్మాటం, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. ప్రయాణాలు అనుకూలించవు. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయటం శ్రేయస్కరం. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిదికాదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉదయాన్నే నిద్ర లేచి ఎవర్ని చూస్తే శుభ ఫలితాలుంటాయి?