Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుధవారం (09-05-2018) దినఫలాలు - అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు...

మేషం: ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళుకువ, ఏకాగ్రత వహించండి. ఉన్నత అధికారులపై దాడులు జరిగే ఆస్కారం ఉంది. కంప్యూటర్ రంగాలవారు పురోభివృద్ధి పొందుతారు. రాబడికి మించి ఖర్చులు ఎదురౌతాయి. విద్యార్థుల

Advertiesment
Daily Horoscope
, బుధవారం, 9 మే 2018 (08:32 IST)
మేషం: ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళుకువ, ఏకాగ్రత వహించండి. ఉన్నత అధికారులపై దాడులు జరిగే ఆస్కారం ఉంది. కంప్యూటర్ రంగాలవారు పురోభివృద్ధి పొందుతారు. రాబడికి మించి ఖర్చులు ఎదురౌతాయి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల ఇబ్బందులు తప్పవు.
 
వృషభం: ఖాది, చేనేత, నూలు వస్త్ర వ్యాపారులకు కలిసివస్తుంది. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెలకువ వహించండి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. 
 
మిధునం: కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. స్త్రీల ఏమరుపాటుతనం, అతి ఉత్సాహం వల్ల విలువైన వస్తువులు జారవిడుచుకుంటారు. కీలకమైన విషయాల్లో కుటుంబీకుల సలహా పాటించటం మంచిది. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి.
 
కర్కాటకం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కొత్త పథకాలు ఆచరణలో పెట్టి జయం పొందండి. ట్రాన్సుపోర్టు, ఆటోమోబైల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఎ.సి. కూలర్లు, ఇన్‌వెన్‌టర్ రంగాలలో వారికి లాభదాయకం శుభదాయకంగా ఉంటుంది. 
 
సింహం: వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. స్త్రీలు షాపింగ్‌లకు ధనం బాగా ఖర్చుచేస్తారు. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. గృహంలో విలువైన వస్తువులు చోరీకిగుయ్యే ఆస్కారం ఉంది. ప్రేమికులకు పెద్దల నుంచి మందలింపులు, హెచ్చరికలు తప్పవు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య: స్త్రీలకు నరాలు, కళ్లు, దంతాలకు సంబంధించిన సమస్యలెదురవుతాయి. రుణాలు, పెట్టుబడులు సకాలంలో అందుతాయి. బంధుమిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి. పాత రుణాలు తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. చిత్తశుద్ధితో మెలిగి మీ నిజాయితీని చాటుకుంటారు. పెంపుడు జంతువుల పట్ల మెళకువ వహించండి. 
 
తుల: కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు ఆరోగ్య సంతృప్తి, శారీరక పటుత్వం నెలకొంటాయి. ఉమ్మడి వెంచర్లు, సంస్థల స్థాపనలో పునరాలోచన అవసరం. అధికారులకు ఒత్తిడి, తనిఖీలు, పర్యటనలు అధికం. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. 
 
వృశ్చికం: కుటుంబంలో స్పర్థలు, చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. రాబడికి మంచి ఖర్చులు అధికమవుతాయి. ప్రభుత్వ సంస్థల్లో వారు జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతి పథంలో కొనసాగుతాయి. 
 
ధనస్సు: ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగస్తులు, ప్రైవేటు సంస్థల్లో వారికి అధికారులతో అవగాహన కుదరదు. మత్స, పాడి పరిశ్రమల వారికి సామాన్యంగా ఉంటుంది. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. అధికారులకు కిందిస్థాయి సిబ్బంది సాదర వీడ్కోలు పలుకుతారు. 
 
మకరం: రాజకీయ, పారిశ్రమిక రంగాల వారికి విదేశీపర్యటనలు అధికమవుతాయి. వైద్యులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల నిర్లక్ష్య ధోరణి వల్ల పై అధికారులతో మాటపడక తప్పదు. ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళకు మెళుకువ అవసరం. 
 
కుంభం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ఉత్తరప్రత్యుత్తరాలు, బ్యాంకింగ్  వ్యవహారాల్లో మెళుకువ వహించండి. విద్యార్థులకు మిత్ర బృందాల పట్ల సమస్యలు తలెత్తుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీల మనోభావాలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
మీనం: కోళ్ళ, మత్స, పాడి పరిశ్రమల వారికి సామాన్యంగా ఉంటుంది. పత్రిక, ప్రైవేటు సంస్ధలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక వైపు భార్యకు గులాము, మరొకవైపు డబ్బుకు గులాము...